‘పాన్ ఇండియా’పై రవితేజ సెటైర్

ప్రతి సినిమాకు పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తగిలించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. రీసెంట్ గా వచ్చిన ఓ చిన్న సినిమాకు కూడా పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తగిలించేశారు. ఈ…

ప్రతి సినిమాకు పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తగిలించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. రీసెంట్ గా వచ్చిన ఓ చిన్న సినిమాకు కూడా పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తగిలించేశారు. ఈ పోకడపై రవితేజ తనదైన స్టయిల్ లో స్పందించాడు. భారీగా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా అవ్వదంటున్నాడు ఈ నటుడు.

“పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ గురించి నేను అనుకుంటున్నది వేరు. భారీ రిలీజ్ దానికి సరిపోదు. ప్రతిది పాన్ ఇండియా అయిపోదు. నా సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా సినిమా అవుతుంది. పాన్ ఇండియా అవ్వాలంటే కథలో కంటెంట్ ఉండాలి.”

ఇలా పాన్ ఇండియా కాన్సెప్ట్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రవితేజ. మరోవైపు కాంబినేషన్లపై కూడా స్పందించాడు. తను కాంబినేషన్ ను నమ్మనని, కథను నమ్ముతానని చెబుతున్నాడు. కథ నచ్చకుండా కాంబినేషన్ కుదిరిందని చేయడం తన వల్ల కాదంటున్నాడు.  

“కథ నచ్చితే ఓకే చేస్తాను. ఇంకాస్త పక్కాగా చేసుకొని రమ్మంటాను. ముందు కథ నచ్చాలి. కథ నచ్చకుండా కాంబినేషన్ గురించి చేసే ప్రసక్తే లేదు. నేనే కాదు ఎవరూ కథ నచ్చకుండా చేయరు.”

రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకుడు.