మాస్ హీరో రవితేజతో మళ్లీ మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రీ మూవీస్ అధినేతలు. గతంలో అమర్ అక్బర్ ఆంథోనీ అనే సినిమా చేసారు. కానీ అది బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పెయిల్ అయింది. మైత్రీ మూవీస్ చాలా డబ్బు పొగొట్టుకుంది. ఆ తరువాత రవితేజ చాలా సినిమాలు చేసారు. వాటిలో మంచి హిట్ లు వున్నాయి, ఫ్లాపులు వున్నాయి. మైత్రీ మూవీస్ కూడా భారీ సినిమాల దిశగా సాగిపోతోంది.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేసే ఆలోచనలు సాగుతున్నాయి. క్రాక్ టీమ్ ను రిపీట్ చేయాలని మైత్రీ సంస్థ ఆలోచిస్తోంది. రవితేజ కు క్రాక్ మంచి హిట్. అందుకే అదే టీమ్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
క్రాక్ టీమ్ తో మళ్లీ మరో సినిమా చేయాలని రవితేజ కూడా చాలా ఆసక్తిగా వున్నారట. అందుకే ఈ కాంబో ప్రాజెక్ట్ ఫిక్స్ అవుతుంది. మంచి టైమ్ చూసుకుని అనౌన్స్ మెంట్ కూడా రావచ్చు.
క్రాక్ సినిమా తరువాత రవితేజ కు ధమాకా వరకు హిట్ పడలేదు. ఆ తరువాత కూడా రావణాసుర దారుణంగా ఫ్లాప్ అయింది. టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ సినిమాలు నిర్మాణంలో వున్నాయి. సితార సంస్థ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో వుంది.