ఇవాళ్టి నుంచి ఎఫ్3 పరిస్థితేంటి?

ఎఫ్3 సినిమాపై మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. కొంతమందికి సినిమా నచ్చింది. మరికొంతమందికి ఇది నచ్చలేదు. రివ్యూస్, రేటింగ్స్ బాగున్నప్పటికీ, ఇలా డివైడ్ మౌత్ టాక్ నడుస్తోంది. మరోవైపు దర్శకుడు మాత్రం లాజిక్కులు పట్టించుకోకుండా…

ఎఫ్3 సినిమాపై మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. కొంతమందికి సినిమా నచ్చింది. మరికొంతమందికి ఇది నచ్చలేదు. రివ్యూస్, రేటింగ్స్ బాగున్నప్పటికీ, ఇలా డివైడ్ మౌత్ టాక్ నడుస్తోంది. మరోవైపు దర్శకుడు మాత్రం లాజిక్కులు పట్టించుకోకుండా సినిమా ఎంజాయ్ చేయమంటున్నాడు. ఇంకోవైపు దిల్ రాజు మంచి నంబర్స్ రిలీజ్ చేస్తున్నాడు. 

ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా పరిస్థితేంటనేది చూడాలి.

ఎంత పెద్ద సినిమాకైనా సోమవారం వచ్చిందంటే థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గుతుంది. ఎఫ్3 కి కూడా ఇవాళ్టి నుంచి ఆక్యుపెన్సీ తగ్గడం ఖాయం. కాకపోతే ఈవినింగ్, సెకండ్ షోలు అందుకుంటే సినిమా కోలుకుంటుంది. లేదంటే వచ్చే వారం మరో సినిమాతో పోటీ సిద్ధంగా ఉంది. సాయంత్రం షోలు పికప్ అయినప్పటికీ, సాధారణ టికెట్ రేట్లతో ఏ మేరకు రికవర్ అవుతుందనేది చూడాలి.

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లు మాత్రమే ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. కానీ అంతకంటే తక్కువ టికెట్ రేట్లకు మేజర్ సినిమాను ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. టికెట్ ధరల అంశాన్ని పక్కనపెడితే..ఎఫ్3కి ప్రధామైన పోటీ మేజర్ సినిమానే.

యూనిట్ చెబుతున్న లెక్కల ప్రకారం.. ఎఫ్3 సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 50శాతం బ్రేక్ ఈవెన్ సాధించిందంట. సో.. మిగతా డబ్బులు కూడా రావాలంటే మరో వీకెండ్ ఈ సినిమా గట్టిగా ఆడాల్సి ఉంటుంది. కరోనా, స్టార్ కాస్ట్ వల్ల అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువగా ఖర్చు అయిన ఈ సినిమా హిట్టయితేనే ఎఫ్4కు లైన్ క్లియర్ అవుతుంది.