అందాల తార మొండిత‌నం…కోవిడ్ ప‌రీక్ష‌ల‌కు ‘నో’

బాలీవుడ్ అల‌నాటి అందాల తార రేఖ మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముంబైలో ఆమె నివాసం ఉంటున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆమె నివాస భ‌వ‌నం సెక్యూరిటీకి క‌రోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కోవిడ్…

బాలీవుడ్ అల‌నాటి అందాల తార రేఖ మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముంబైలో ఆమె నివాసం ఉంటున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆమె నివాస భ‌వ‌నం సెక్యూరిటీకి క‌రోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఆమె ఇంటిని సీల్ చేసింది. ఇంటి ప‌రిస‌రాల‌ను కంటైన్మెంట్ జోన్‌గా కూడా ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో అందాల తార రేఖ‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిం చేందుకు వైద్యులు ఆమె ఇంటికి వెళ్లారు. కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు ఆమె స‌సేమిరా అన్న‌ట్టు స‌మాచారం.

ప్రస్తుతం ముంబైలోని బాంద్రాలో తన నివాసం సీ స్ర్పింగ్‌లో స్వీయ  నిర్బంధంలో ఉన్నారు. త‌న‌కు ఎలాంటి అనారోగ్య , కోవిడ్ ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డం వ‌ల్లే వైద్య ప‌రీక్ష‌ల‌కు నో చెప్పిన‌ట్టు తెలిసింది. రేఖ వైఖ‌రిపై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

సాక్షిలో బిత్తిరి సత్తి ప్రోమో