రిపబ్లిక్ డే ఎఫెక్ట్.. సంక్రాంతి సినిమాలకు సెగ

లెక్కప్రకారం సంక్రాంతికి రావాలి. కానీ బాక్సాఫీస్ లో స్ట్రయిట్ సినిమాల తొక్కిడి ఎక్కువగా ఉండడంతో, డబ్బింగ్ సినిమాలన్నీ వేటికవే వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన సినిమాలు 2, రిపబ్లిక్ డే వీకెండ్ లో…

లెక్కప్రకారం సంక్రాంతికి రావాలి. కానీ బాక్సాఫీస్ లో స్ట్రయిట్ సినిమాల తొక్కిడి ఎక్కువగా ఉండడంతో, డబ్బింగ్ సినిమాలన్నీ వేటికవే వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన సినిమాలు 2, రిపబ్లిక్ డే వీకెండ్ లో తెలుగు తెరపైకొస్తున్నాయి.

రిపబ్లిక్ డే కానుకగా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది అయలాన్ సినిమా. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటించాడు. చాన్నాళ్ల తర్వాత ఈ డబ్బింగ్ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్, తెలుగు ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు.

ఇక ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా నటించిన పీరియాడిక్ మూవీ ఇది. సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఇందులో నటించగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది. సార్ సినిమాతో తెలుగులో తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్న ధనుష్, కెప్టెన్ మిల్లర్ తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి

ఇప్పుడు చెప్పుకున్న ఈ 2 సినిమాలు తమిళనాట ఆల్రెడీ రిలీజై, ఇప్పుడు తెలుగులో అడుగుపెడుతున్నాయి. కెప్టెన్ మిల్లర్ సినిమా మంచి బ్యాకింగ్ తో థియేటర్లలోకి వస్తోంది. దీంతో గుంటూరుకారం సినిమా ఈ వీకెండ్ నాటికి మరిన్ని థియేటర్లు కోల్పోయేలా కనిపిస్తోంది.

ఇప్పటికే గుంటూరుకారం సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కౌంట్ పడిపోయింది. ఉదాహరణకు హైదరాబాద్ నే తీసుకుంటే, సిటీలో గుంటూరుకారం 49 స్క్రీన్స్ కే పరిమితం కాగా.. హను-మాన్ సినిమా మాత్రం దాదాపు 90 స్క్రీన్స్ తో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాలతో పాటు.. 105, ప్రేమలో, బిఫోర్ మ్యారేజ్ లాంటి కొన్ని సినిమాలు కూడా 26కి రిలీజ్ అవుతున్నాయి. దీంతో సంక్రాంతికొచ్చిన గుంటూరుకారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలు కొన్ని థియేటర్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.