ఏపీ శాసనమండలి రాజకీయాలను రామ్ గోపాల్ వర్మ బాగానే ఫాలో అవుతున్నట్టుగా ఉన్నాడు. మండలిలో పరిణామాల మీద తన దైన ట్వీట్ వేశాడు ఈ సినీ దర్శకుడు. మండలిలో చర్చ సాగుతూ ఉండగా.. ఆ సమయంలో ఎమ్మెల్యేలు గ్యాలరీల్లో కూర్చుని వీక్షించారు. ఆ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్ఫీ దిగారు.
ఈ సెల్ఫీ ని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దానిపై ఆర్జీవీ తన కామెంట్ ను జత చేశాడు. ఈ సందర్భంగా బాలకృష్ణను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ పరోక్షంగా ఘాటైన కామెంట్ పెట్టాడు.
'వావ్ రోజాగారూ.. ఈ సెల్ఫీలో ఆమె హీరోలా ఉన్నారు. ఆమె పక్కన కుడివైపు ఉన్న వ్యక్తి చూడటానికి యాక్.. ఈ ఫొటోను అతడి ఫేస్ స్పాయిల్ చేస్తూ ఉంది. బహుశా అతడు ఆమెకు దిష్టి బొమ్మేమో' అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అలాగే మరోసారి అదే ఫొటోను పోస్టు చేసి.. ఆ ఫొటోలో రోజా పక్కన ఉన్న వ్యక్తి ఎవరో చెప్పాలంటూ ట్వీట్ చేశాడు!
ఇలా బాలకృష్ణను దిష్టిబొమ్మ అన్నట్టుగా ట్వీట్ చేసి రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన కెళుకుడు కెళికాడు. ఇది నందమూరి అభిమానులకు మంటపెట్టే వ్యవహారమే. అయితే రామ్ గోపాల్ వర్మను అలా వదిలేయడమే తప్ప వాళ్లు కూడా ఏమీ చేసేది లేకపోవచ్చు!