Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరోయిన్ భ‌ర్త అని అన‌డం ఇగోని హ‌ర్ట్ చేసింద‌ట‌!

హీరోయిన్ భ‌ర్త అని అన‌డం ఇగోని హ‌ర్ట్ చేసింద‌ట‌!

మ‌హారాష్ట్ర‌, హిందీ మాట్లాడే ప్రాంతాల్లో రితేష్ దేశ్ ముఖ్ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉండ‌వ‌చ్చు. హిందీ సినిమా న‌టుడుగా, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ త‌న‌యుడిగా ఇత‌డికి గుర్తింపు ఉండ‌వ‌చ్చు.

అయితే.. హిందీ సినిమాలు అంతగా చూడ‌ని వారికి, మ‌హారాష్ట్ర రాజ‌కీయాల గురించి తెలియ‌ని ద‌క్షిణాది వారికి మాత్రం జెనీలియా భ‌ర్త‌గానే ఇత‌డు ప‌రిచ‌యం!

ద‌క్షిణాదిన ఒకానొక ద‌శ‌లో స్టార్ హీరోయిన్ గా చ‌లామ‌ణి అయిన జెనీలియా ఇత‌డిని పెళ్లి చేసుకుంద‌ని ఆమెను ఎరిగిన వారికి తెలుసు. రితీష్ కు జెనీలియా భ‌ర్త‌గానే ద‌క్షిణాదిన ఎక్కువ గుర్తింపు ఉంది. ఈ విష‌యం తెలిసిన‌ప్పుడు త‌న ఇగో హ‌ర్ట్ అయ్యింద‌ని చెప్పాడు రితీష్ దేశ్ ముఖ్.

ఆ మ‌ధ్య సినిమా స్టార్ల క్రికెట్ మ్యాచ్ కోసం బెంగ‌ళూరుకు వెళ్తే.. త‌న‌ను అక్క‌డ అంతా జెనీలియా భ‌ర్త అంటూ గుర్తుప‌ట్టార‌ని బాధ‌ప‌డిపోయాడు రితీష్. ఆ స‌మ‌యంలో త‌న ఇగో హ‌ర్ట్ అయ్యింద‌ని స‌ర‌దాగా బాధ‌ప‌డిపోయాడు రితీష్.

ద‌క్షిణాది వ‌ర‌కూ త‌ను జెనీలియా భ‌ర్త‌నేమో కానీ, మ‌హారాష్ట్ర‌లో మాత్రం త‌న భార్య జెనీలియా అని తాజాగా చ‌మ‌త్క‌రించాడు ఈ హీరో. సుదీర్ఘ కాల ప్రేమాయ‌ణం త‌ర్వాత రితీష్ -జెనీలియాలు వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా.

గుడ్డొచ్చి పిల్ల‌ని వెక్కిరిస్తోంది...

మోదీకి చిక్కిన కేసీఆర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?