Advertisement

Advertisement


Home > Movies - Movie News

సుశాంత్‌పై గర్ల్‌ఫ్రెండ్ జ్ఞాప‌కాలు ఎంతో ప్ర‌త్యేకం

సుశాంత్‌పై  గర్ల్‌ఫ్రెండ్ జ్ఞాప‌కాలు ఎంతో ప్ర‌త్యేకం

అదేంటో గానీ మ‌నిషి బ‌తికి ఉన్న‌ప్పుడు ప్రేమ చూప‌ని వాళ్లు...చ‌చ్చిన త‌ర్వాత గొప్ప‌గొప్ప మాట‌లు చెబుతారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి నేటికి నెల పూర్త‌వుతోంది. ఈ సంద‌ర్భంగా సుశాంత్ అభిమానులు , మిత్రులు ఆ యంగ్ హీరోకి సంబంధించిన జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటున్నారు. వీటిలో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి జ్ఞాప‌కాలు ఎంతో ప్ర‌త్యేకం.

ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్‌తో త‌న ప్రేమ బంధాన్ని తెలిపే ఫొటోల‌ను షేర్ చేయ‌డంతో భావోద్వేగ లేఖ రాశారు. ఆ లేఖ‌ను హృద‌యంతో రాసుకొచ్చారు. ప్ర‌తి అక్ష‌రం క‌వితాత్వంకంగా, సుశాంత్ గొప్ప‌త‌నాన్ని చాటేలా ఉంది. అలాగే సుశాంత్‌కు త‌న హృద‌యంలో ఎలాంటి స్థానం క‌ల్పించారో కూడా లేఖ ద్వారా వెల్ల‌డించారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇదే.

‘సుశాంత్ నువ్వు ఈ లోకాన్ని వీడి అప్పుడే నెల రోజులైందంటే న‌మ్మ‌శ‌క్యం కావ‌డం లేదు. నాలో చెల‌రేగుతున్న‌ భావోద్వే గాలను ఎదుర్కోడానికి ప‌డుతున్న క‌ష్టాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను. అలాగే అక్ష‌రీక‌రించ‌లేను. నా మనసులో ఏదో అలజడి.  ప్రేమపై  నమ్మకాన్ని కలిగించావు. అలాగే ప్రేమ ఎంత శ‌క్తిమంత‌మైందో చాటి చెప్పావు. అన్నిటికి మించి జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించావు. నువ్వు శాశ్వతంగా వెళ్లిపోయావనే విషయాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను. నీలాంటి గొప్ప శాస్త్రవేత్తకు, మ‌నిషికి చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు స్వాగతం పలికి ఉంటాయ‌ని నమ్ముతున్నాను’. అంటూ ఉద్వేగ‌భ‌రిత లేఖ రాసుకెళ్లారు.

‘ నీకోసం ఎంతో ఎదురు చూస్తుం టాను. నిన్ను మళ్లీ తిరిగి నా దగ్గరకు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు అందమైన, గొప్ప వ్యక్తివి. ప్రప్రంచం చూసిన వ్యక్తుల్లో నువ్వు అద్భుతం. మన మధ్య ఉన్న ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేక పోతున్నాయి. నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. నీకు శాశ్వతంగా కనెక్టు అయ్యాను’. అంటూ సుశాంత్‌పై  అమితమైన ప్రేమను రియా చక్రవర్తి వ్య‌క్తీక‌రించారు.

కార‌ణాలేవైనా సుశాంత్ ఇప్పుడు భౌతికంగా మ‌న మ‌ధ్య లేడు. ఆయ‌న సినిమాలు, జ్ఞాప‌కాలు మాత్ర‌మే మిగిలాయి. మ‌నిషికి మ‌ర‌ణం ఉంటుందే త‌ప్ప అత‌ను చేసిన మంచికి, పంచిన ప్రేమ‌కు కాద‌నే స‌త్యం సుశాంత్ విష‌యంలో మ‌రోసారి నిరూపిత‌మ‌వుతోంది. అదే మ‌నిషి గొప్ప‌త‌నం. 

సిక్స్ ప్యాక్ లో నాగ శౌర్య

విశాఖ ఫార్మాసిటీ లో భారీ అగ్నిప్రమాదం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?