ఎన్టీఆర్…రామ్ చరణ్ లాంటి ఇద్దరు హేమా హేమీ హీరోలు. రాజమౌళి లాంటి అంతర్ఙాతీయ ఖ్యాతి గడించిన దర్శకుడు. అడ్డగోలు రేట్లు. ఫ్యాన్సీ ఫ్యాన్స్ షో లు. ఇవన్నీ మరిచిపోతున్నారు. వీకెండ్ కు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. బయ్యర్లు సేఫ్ అవుతారు. ఒకరిద్దరు మిగిలినా ఉగాది వేళకు బ్రేక్ ఈవెన్ కు వస్తారు. ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి బిజినెస్ సర్కిళ్లలో.
ఇదేం లెక్క. ఈ కాంబినేషన్ కు ఇలాంటి మాటలా వినిపించేది. షంషేర్ గా వుండాలి కదా. అదేదో మిగిలిన టాప్ డైరక్టర్ల సినిమా మాదిరిగా, మిగిలిన బిగ్ సినిమా మాదిరిగా, బయటపడిపోతారు. బ్రేక్ ఈవెన్ అయిపోతుంది లాంటి మాటల వినిపించడం ఏమిటో? పైగా ఎంత సేపూ పెట్టిన రేట్లు, బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుతున్నారు. కోట్లకు కోట్లు ఏళ్లకు ముందు అడ్వాన్స్ లు ఇచ్చారు బయ్యర్లు. వాటికి రూపాయి వడ్డీ లెక్క కట్టుకున్నా కోట్ల అదనపు భారం పడుతుంది.
నైజాం ఏరియాకు 15 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు దిల్ రాజు ఎప్పుడో. ఓవర్ సీస్ కు ఏనాడో 65 కోట్లు సింగిల్ పేమెంట్ ఇచ్చారు. అలాగే కొన్న బయ్యర్లు కొన్ని ఏరియాలు కిందకు ఆనాడే అమ్మేసారు. వాళ్లు కోట్లు పెట్టుబడి పెట్టారు. ఎవ్వరూ వడ్డీల గురించి ఆలోచించడం లేదు. పెట్టిన డబ్బులు వస్తే చాలు అన్నట్లు చూస్తున్నారు.
కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ బయ్యర్లు అందరూ ఎవరి స్థాయిలో వారు ఇచ్చిన అడ్వాన్స్ ల వడ్డీలు అన్నీ తడిసి మోపెడయ్యాయి. అవి కూడా కలిపితే బ్రేక్ ఈవెన్ అన్నమాట వినిపించడం కష్టం అవుతుంది.
ఇక్కడ ఇంకోపాయింట్ కూడా వుంది. బాహుబలి హీరో ప్రభాస్ కు దాని ఫాలో అప్ సినిమా సాహో..ఆ సినిమా కంటెంట్ ఎలా వున్నా జనం ఆదరించేసారు. అదే బాహుబలి తరువాత దాని దర్శకుడు రాజమౌళి ఫాలో అప్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కంటెంట్ గురించి డివైడ్ టాక్ వున్నా, ఆదరించేసారు.
ప్రభాస్ జాగ్రత్త పడకుండా రాధేశ్యామ్ అందించారు. జనం పక్కన పెట్టారు. అయితే రాజమౌళి తెలివైన వాడు కాబట్టి తరువాత సినిమా పూల్ ప్రూఫ్ గా వుండేలా చూసుకునే అవకాశం ఎక్కువ వుంది.