ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ సాంగ్ రిలీజైంది. ఈ పాటను రిలీజ్ చేయడానికి బహుశా ఇంతకంటే మంచి సందర్భం ఇంకోటి ఉండదు. గ్రాండ్ గా రిలీజైన దోస్తీ సాంగ్ సాహిత్యం-సంగీతం పరంగానే కాకుండా.. మేకింగ్ పరంగా కూడా ఆకట్టుకుంది.
ముందుగా పాట గురించి మాట్లాడుకుంటే.. కీరవాణి ఎప్పట్లానే తన మార్క్ ట్యూన్ అందించారు. అక్కడక్కడ బాహుబలి పాటల్లో సౌండింగ్ రిపీట్ అయినట్టు అనిపించినప్పటికీ…. ఓవరాల్ గా పాట బాగుంది. అయితే సీరియస్ గా సాగే ఈ పాటకు ఎంత రిపీట్ వాల్యూ ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం.
ఇక సిరివెన్నెల సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పులికి-విలుకాడికి, తలకి-ఉరితాడుకి, కార్చిచ్చుకి-వడగళ్లకి, రవికి-మేఘానికి దోస్తీ అంటూ రాసిన సాహిత్యం చాలా బాగుంది. ఈ దోస్తీ సాంగ్ తెలుగు వెర్షన్ ను హేమచంద్ర ఆలపించాడు.
ఇక ఈ పాట మేకింగ్ కూడా ఆకట్టుకునేలా సాగింది. చేతులు కలిపే ఆర్ఆర్ఆర్ ట్రేడ్ మార్క్ ను బ్యాక్ డ్రాప్ లో పెట్టి.. నీరు-నిప్పు థీమ్ ను ఎలివేట్ చేస్తూ సాంగ్ ను పిక్చరైజ్ చేశారు. చివర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా కదిలొచ్చి, కలిసొచ్చి కీరవాణి టీమ్ ను అభినందించడం హైలెట్ గా చెప్పుకోవాలి.
అయితే ఈ మేకింగ్ లో రాజమౌళి మార్క్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పైగా పాటలో అనిరుధ్, విజయ్ ఏసుదాస్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే, ఆఖరి నిమిషంలో హడావుడిగా తీసినట్టు అనిపిస్తుంది.
ఓవరాల్ గా ఆర్ఆర్ఆర్ దోస్తీ పాట.. మ్యూజిక్ పరంగా అటు బాహుబలిని, మేకింగ్ పరంగా ఇటు అల వైకుంఠపురములో లిరికల్ వీడియోస్ ను గుర్తుచేసినప్పటికీ.. ఓవరాల్ గా బాగుంది. కేవలం ఫ్రెండ్ షిప్ సాంగ్ లా మాత్రమే కాకుండా.. ఆర్ఆర్ఆర్ సినిమా థీమ్ ను ఈ పాటలో చెప్పారు.