IMDb ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ.. ఈ ఏడాది గూగుల్ ట్రెండ్ లో మాత్రం తన స్థానాన్ని నిలుపుకోలేకపోయింది. గూగుల్ ట్రెండ్స్ లో తన హవా చాటలేకపోయింది. ఈ ఏడాదికి గాను టాప్ ట్రెండింగ్ మూవీస్ జాబితా విడుదల చేసింది గూగుల్. అందులో ఆర్ఆర్ఆర్ నాలుగో స్థానంలో నిలిచింది.
గూగుల్ లో భారీగా ట్రెండ్ అయిన ఇండియన్ మూవీగా బ్రహ్మాస్త్ర నిలిచింది. రణబీర్ కపూర్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై నార్త్ లో భారీ చర్చ జరిగింది. అదే గూగుల్ ట్రెండింగ్ కు కారణమైంది. ఇక రెండో స్థానంలో కేజీఎఫ్ ఛాప్టర్-2 నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన ఈ సినిమా దాదాపు 3 వారాల పాటు ఆలిండియా గూగుల్ ట్రెండింగ్ లో కనిపించింది.
ఇక టాప్-10 గూగుల్ ట్రెండ్స్ లో మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్ సినిమాలు నిలవగా, స్వీయదర్శకత్వంలో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా, అనూహ్యంగా ఆఖరి నిమిషంలో 5వ స్థానానికి ఎగబాకింది. ట్రెండింగ్స్ లో పుష్ప పార్ట్-1ను ఇది బీట్ చేసింది.
థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయిన లాల్ సింగ్ చడ్డా సినిమా మాత్రం గూగుల్ సెర్ట్ టాప్-10 లిస్ట్ లో చోటు దక్కించుకుంది. అయితే ఈ లిస్ట్ లో కూడా సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. 2022 గూగుల్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్.. 1. బ్రహ్మాస్త్ర, 2. కేజీఎఫ్-2, 3. ది కశ్మీర్ ఫైల్స్, 4. ఆర్ఆర్ఆర్, 5. కాంతార, 6. పుష్ప, 7. విక్రమ్, 8. లాల్ సింగ్ చడ్డా, 9. దృశ్యం2, 10.థార్