సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత.. నిజమేనా!

“టాలీవుడ్ టాప్ లిరిక్ రైటర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సుద్దాల అశోక్ తేజ తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. ఆయన్ను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో జాయిన్ చేశారట. అర్జెంట్…

“టాలీవుడ్ టాప్ లిరిక్ రైటర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సుద్దాల అశోక్ తేజ తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. ఆయన్ను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో జాయిన్ చేశారట. అర్జెంట్ గా ఆయనకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలంట. బి-నెగెటివ్ రక్తం దొరక్క కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారట.”

రాత్రి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఇది. కానీ ఇందులో నిజం కంటే అబద్ధమే ఎక్కువుంది. అవును.. సుద్దాలకు ఆరోగ్యం బాగాలేకపోయిన మాట వాస్తవమే. కానీ పైన చెప్పుకున్నంత సీరియస్ గా మాత్రం పరిస్థితి లేదని ఆయన బంధువులు, సన్నిహితులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారట.

ఈ విషయంపై స్వయంగా సుద్దాల కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు కాస్త నలతగా ఉన్న మాట వాస్తవమేనని, కానీ అంత మాత్రానికే తనకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అంటూ వార్తలు రాయొద్దని ఆయన మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తనకు అర్జెంట్ గా బ్లడ్ కావాలని, రక్తదానం చేయాలంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులో అస్సలు నిజం లేదంటున్నారాయన.

నల్గొండ ప్రాంతానికి చెందిన సుద్దాల అశోక్ తేజ, టాలీవుడ్ లో గేయ రచయితగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 12వందలకు పైగా సినిమాలకు పనిచేసిన ఆయన 2వేలకు పైగా పాటలు రాశారు. ఠాగూర్ సినిమాకు గాను ఉత్తమ గేయరచయితగా జాతీయ అవార్డ్ కూడా అందుకున్నారు. నటుడు ఉత్తేజ్, సుద్దాల అశోక్ తేజ దగ్గర బంధువులు.

మావాడిని టీడీపీ వాళ్ళు తట్టుకోలేరు