ఎన్టీఆర్, బన్నీ, చరణ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరు?

అభిమానుల్ని అడిగితే ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తాయి. కానీ ఓ హీరోను అడిగితే మాత్రం చాలా కష్టం. సరిగ్గా ఇదే ప్రశ్న సాయితేజ్ కు ఎదురైంది. దీంతో ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో…

అభిమానుల్ని అడిగితే ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తాయి. కానీ ఓ హీరోను అడిగితే మాత్రం చాలా కష్టం. సరిగ్గా ఇదే ప్రశ్న సాయితేజ్ కు ఎదురైంది. దీంతో ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక చాలా తికమకపడ్డాడు. ఫైనల్ గా తనదైన స్టయిల్ లో సమాధానం చెప్పాడు.

“డాన్స్ లో నంబర్ వన్ ఎప్పటైనా చిరంజీవి గారే. ఆయన తర్వాత తారక్, బన్నీ, చరణ్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. తారక్ డాన్స్ లో క్లాసికల్ టచ్ కనిపిస్తుంది. బన్నీ కొత్త కొత్త మూమెంట్స్ ట్రై చేస్తుంటాడు. అతడి డాన్స్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఇక చరణ్ ఏ స్టెప్ వేసినా అందులో గ్రేస్ కనిపిస్తుంది. ఆ స్టెప్ కే ఓ అందం వస్తుంది.”

ఇలా ముగ్గురూ ముగ్గురే అంటూ సమాధానమిచ్చాడు సాయితేజ్. తను మాత్రం డాన్స్ విషయంలో ఇంకా వాళ్లను రీచ్ కాలేదంటున్నాడు. ప్రతి రోజూ పండగే సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో, ఆ ఆనందంలో తన డిగ్రీ కాలం నాటి లవ్ స్టోరీస్ ను కూడా బయటపెట్టాడు. అప్పట్లో అమ్మాయి కనిపిస్తే వెంటపడేవాడినని చెప్పుకొచ్చాడు.

“డిగ్రీ చదివే రోజుల్లో ఒకటి కాదు, చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. అమ్మాయి నచ్చితే వెళ్లి లవ్ లెటర్ ఇచ్చేసేవాడ్ని. రిజెక్ట్ చేస్తే మళ్లీ ఆ లెటర్ తీసుకొని వెనక్కి వచ్చేసేవాడ్ని. నాకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నాకు లవ్ లెటర్లు రాసి పెట్టేవాడు.”

ప్రస్తుతానికైతే తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని స్పష్టంచేశాడు సాయితేజ్. ఇలా సోలోగా ఉండడం చాలా బాగుందని అంటున్నాడు.