శాకుంతలం..సమంత..డల్ ఓపెనింగ్

సమంత…దిల్ రాజు..గుణశేఖర్. పెద్ద పెద్ద పేర్లు కానీ శాకుంతలం తొలి రోజు వసూళ్లు చూస్తే బేజారే. సినిమా విడుదల తరువాత సంగతి సరే. ముందు ఓపెనింగ్ ఎందుకు లేదు? లేడీ సూపర్ స్టార్ అంటారు…

సమంత…దిల్ రాజు..గుణశేఖర్. పెద్ద పెద్ద పేర్లు కానీ శాకుంతలం తొలి రోజు వసూళ్లు చూస్తే బేజారే. సినిమా విడుదల తరువాత సంగతి సరే. ముందు ఓపెనింగ్ ఎందుకు లేదు? లేడీ సూపర్ స్టార్ అంటారు కదా సమంత. అది నమ్మే కదా దిల్ రాజు-గుణశేఖర్ 70 కోట్లు పెట్టుబడి పెట్టారు. కానీ రెండు విధాల షాక్ తగిలింది. 

సినిమా మాకొద్దు అంటే మాకొద్దు అని బయ్యర్లు అనడం తొలి షాక్. ఆఖరిక అడ్వాన్స్ ల మీద విడుదల చేసుకోవాల్సి వచ్చింది. సినిమాకు సరైన ఓపెనింగ్ పడలేదు. అది రెండో షాక్.

ఉత్తరాంధ్రలో పట్టుమని 14 లక్షలు షేర్ రాలేకపోయింది. దీనికన్నా యశోద నే బెటర్ 16 లక్షలు రాబట్టింది. లారెన్స్ సినిమా రుద్రుడు ఉత్తరాంధ్రలో పది లక్షలు షేర్ రాబట్టింది. నైజాంలో డెభై నుంచి ఎనభై లక్షల వరకు వచ్చిందని తెలుస్తోంది. యశోద సినిమా 65 లక్షల వరకు రాబట్టింది.

అంటే ఈ లెక్కన సమంత సోలో సినిమా స్టామినా అంతే అనుకోవాలి. అది ముఫై నుంచి నలభై ఖర్చు పెట్టి తీసిన యశోద అయినా, 70 ఖర్చు చేసి తీసిన శాకుంతలం అయినా. నిజానికి శాకుంతలం సినిమాకు చేసిన హడావుడికి యశోదకు మించి కలెక్షన్లు వస్తాయని అనుకున్నారంతా. మార్కెటింగ్ లేదా పబ్లిసిటీ లేదా ప్రీమియర్ ప్లానింగ్ ఎక్కడో బెడిసి కొట్టేసింది. ఓపెనింగ్ రాకుండా అయిపోయింది.

ముఖ్యంగా ప్రీమియర్ వేయడం అన్నది సినిమాకు చాలా మైనస్ చేసేసింది. కంటెంట్ ఎలా వుందో తెలిసి కూడా ప్రీమియర్ వేయడం అన్నది చాలా పెద్ద తప్పు అంటూ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు కామెంట్లు వినిపిస్తున్నాయి.