ప్రభాస్ సినిమా ఇప్పుడు ఇంగ్లిష్ లో కూడా..!

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన సలార్ సినిమా, ఓటీటీలో కూడా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా చాలా రోజుల పాటు టాప్ ట్రెండింగ్ లో…

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన సలార్ సినిమా, ఓటీటీలో కూడా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా చాలా రోజుల పాటు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడీ సినిమాను ఇంగ్లిష్ లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది సదరు సంస్థ.

ఈరోజు నుంచి సలార్ సినిమా ఇంగ్లిష్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మరింతమందికి చేరువవుతుందని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఇదే ఎత్తుగడ పనిచేసింది. ఇంగ్లిష్ లో రిలీజ్ చేసిన తర్వాత సినిమాకు మరింత ఆదరణ దక్కింది.

ఇప్పుడు సలార్ యూనిట్ కూడా అదే పద్ధతి ఫాలో అయింది. ఇంగ్లిష్ వెర్షన్ కు కూడా ఆదరణ దక్కితే, సలార్ పార్ట్-2కు వరల్డ్ వైడ్ క్రేజ్ ఏర్పడుతుంది. 

ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ నెల్లోనే హిందీ వెర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లిష్ లో ఈ సినిమా చూస్తుంటే భలే గమ్మత్తుగా ఉంది.