ప్రభాస్ సలార్..ఓ పెద్ద సస్పెన్స్. సినిమా చాలా కాలం కిందటే ప్రారంభమైంది. ప్రారంభమైన కొన్నాళ్లకు రెండు భాగాలు అన్న గ్యాసిప్ బయటకు వచ్చింది. దీనిని అధికారికంగా ప్రకటించిందీ లేదు..ఖండించిందీ లేదు. దర్శకుడిని అడిగితే దాటవేత తప్ప సరైన సమాధానం లేదు.
రెండు భాగాలు పక్కా అని, ఒక దాని వెంట మరొకటి త్వరత్వరగా విడుదలైపోతాయని బలంగా వార్తలు ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ వ్యవహారం వెనక్కు వచ్చిందనే గ్యాసిప్ వినిపిస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ నాటికి ప్రశాంత్ నీల్ సలార్ పని ముగించుకుని, ఎన్టీఆర్ సినిమా మీదకు రావాలంట. అదే విధంగా ప్రభాస్ తన లైనప్ లో వున్న సినిమాలు అన్నీ చకచకా పూర్తి చేయాల్సి వుంది. ఇలాంటి నేపథ్యంలో అటు దర్శకుడికి..ఇటు హీరోకి అన్ని విధాలా అనుకూలంగా వుండేలా సలార్ ను ఒక భాగంగానే చేస్తే ఎలా వుంటుందనే ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా డిసెంబర్ లో మొదలు కావాలి అంటే సలార్ రెండు భాగాల పని నవంబర్ నాటికి పూర్తి కావాల్సి వుంటుంది. షూట్ పూర్తి అయినా, తొలిభాగం విడుదల చేసి, మళ్లీ మలి భాగం పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ పెద్ద ప్రాసెస్. అందువల్ల ఒక భాగంగా మారుస్తారా? లేక రెండు భాగాలుగానే వుంచుతారా? అన్నది అయితే పక్కాగా క్లారిటీ లేదు. మరి కొన్నాళ్లలో రావచ్చేమో?