సినిమాల్లేకపోయినా హీరోయిన్ ఆదాయం తగ్గలేదు

సినిమాలు చేయనని ప్రకటించింది. ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు, మయొసైటిస్ నుంచి మరింత కోలుకునేందుకు, ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్తున్నట్టు తెలిపింది. మరి సమంత ఆదాయం సంగతేంటి? సినిమాలకు తాత్కాలికంగా విరామం…

సినిమాలు చేయనని ప్రకటించింది. ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు, మయొసైటిస్ నుంచి మరింత కోలుకునేందుకు, ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్తున్నట్టు తెలిపింది. మరి సమంత ఆదాయం సంగతేంటి? సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం ఎలాంటి ఆదాయం సంపాదించడం లేదా?

సినిమాల్లేకపోయినా సమంత ఆదాయానికి వచ్చిన ఢోకా ఏం లేదు. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఎక్కువగా ఇప్పుడే సంపాదిస్తోంది. అవును.. యాడ్స్, సోషల్ మీడియా ద్వారా సమంత బాగానే సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె కొన్ని బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఈమధ్య వాటి షూటింగ్స్ కోసం ముంబయి కూడా వచ్చింది.

ఇలా యాడ్స్ చేస్తూనే, మరోవైపు తన ఇనస్టాగ్రామ్ పేజీలో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ, డబ్బులు సంపాదిస్తోంది. ఇంకోవైపు ఆమెకు సొంతంగా ఓ గార్మెంట్స్ బ్రాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అట్నుంచి కూడా ఆదాయం వస్తోంది. కాబట్టి ఆమె ఆదాయానికి వచ్చిన ఇబ్బందేం లేదు. అయితే యాడ్స్ ద్వారా వచ్చేది తాత్కాలికం అనే విషయం సమంతకు తెలుసు.

అందుకే వీలైనంత తొందరగా సినిమాల్లోకి రావాలని ఆమె భావిస్తోంది. ప్రస్తుతం ట్రీట్ మెంట్ లో ఉన్న సమంత.. మరో 3 నెలల్లో ఇండస్ట్రీకి అందుబాటులోకి వస్తుందని సమాచారం. అలా వచ్చే ఏడాదిలో ఆమె తన కెరీర్ ను కొనసాగించేందుకు ఇప్పట్నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే సమంత కథలు వింటోందా లేక ఆల్రెడీ కొన్ని స్టోరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.