Advertisement

Advertisement


Home > Movies - Movie News

సమంత ముంగిట్లో సూపర్ చాన్స్

సమంత ముంగిట్లో సూపర్ చాన్స్

పెళ్లి తరువాత కూడా కెరీర్ ను బాగానే ముందుకు తీసుకెళ్లిన హీరోయిన్ సమంత. కానీ బ్రేకప్ తరువాత అదే ఊపును కొనసాగించడానికి గట్టిగానే కష్టపడుతోంది. రెండు హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమాలు తెలుగులో విడుదల కావాల్సి వుంది. 

ఇలాంటి టైమ్ లో ఓ మాంచి అవకాశం ఆమె తలుపు తట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా మరోసారి నటించే అవకాశం. ఈ విషయం గత కొంత కాలంగా వార్తల్లో నలుగుతోంది. కానీ సమంతకు ఇటు లక్..అటు బ్యాడ్ లక్ దోబూచులాడుతున్నాయి.

ఎన్టీఆర్ తో మరోసారి నటించే అవకాశం రావడం లక్. కానీ దానికి డేట్ లు అడ్ఙస్ట్ కాకపోవడం బ్యాడ్ లక్. విషయం ఏమిటంటే..కొరటాల..ఎన్టీఆర్ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. 

కానీ సమంత ఇప్పటికే ఫ్యామిలీమన్ వెబ్ సిరీస్ తీసే బోస్ అండ్ డికే లకు ఓ ప్రాజెక్టు కమిట్ అయ్యారు. దాన్ని పక్కన పెట్టడానికి లేదు. అలాగే మరో హిందీ సినిమా కూడా కమిట్ అయ్యారు. దాన్ని పక్కన పెట్టడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమా ఆఫర్ వచ్చింది.

నిజానికి ఇది మంచి అవకాశం. చాలా కాలం తరువాత ఇలా ఓ టాప్ హీరో పక్కన హీరోయిన్ చాన్స్ రావడం అంటే చాలా లక్కీనే. దాన్ని ఎలా వర్కవుట్ చేయాలో అన్నది ప్రస్తుతం సమంత ఆలోచిస్తోంది. ఎన్టీఆర్ సిన్మాలో నిర్మాణ భాగస్వామి కళ్యాణ్ రామ్ తన సినిమా విడుదల పనుల్లో బిజీగా వుండడంతో ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టారు.

త్వరలో ఎలా చాకవుట్ చేయాలన్నది ఆలోచిస్తారు. ఏమాత్రం అవకాశం వున్నా ఈ చాన్స్ వదులుకోకూడదనే సమంత పట్టుదలగా వుంది. కానీ అలా చేయాలంటే తన బాలీవుడ్ కమిట్ మెంట్లను అడ్జ‌స్ట్ చేసుకోవాల్సి వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?