సింపతీ క్వీన్ అనే బిరుదుపై స్పందించిన సమంత

హీరోయిన్లపై ట్రోలింగ్స్ కొత్త కాదు, సమంతపై అస్సలు కొత్త కాదు. తను మయొసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డానంటూ గతంలో సమంత ప్రకటించింది. దానికి సంబంధించి ఆమె డీటెయిల్ గా మాట్లాడింది. కొన్ని ఫొటోలు…

హీరోయిన్లపై ట్రోలింగ్స్ కొత్త కాదు, సమంతపై అస్సలు కొత్త కాదు. తను మయొసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డానంటూ గతంలో సమంత ప్రకటించింది. దానికి సంబంధించి ఆమె డీటెయిల్ గా మాట్లాడింది. కొన్ని ఫొటోలు కూడా షేర్ చేసింది.

అయితే అదే టైమ్ లో ఆమె సినిమా శాకుంతలం విడుదలకు సిద్ధమైంది. దీంతో తన సినిమా ప్రచారం కోసమే, సమంత ఇలా సింపతీ డ్రామా ఆడుతోందంటూ కొంతమంది కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఆమెకు సింపతీ క్వీన్ అనే బిరుదు కూడా ఇచ్చారు.

తనకు సోషల్ మీడియాలో ట్రోలర్స్, సింపతీ క్వీన్ అనే బిరుదు ఇచ్చిన విషయాన్ని సమంత అంగీకరించింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సమంత.. శాకుంతలం సినిమా విడుదల టైమ్ లో తన వ్యాధి గురించి బయటపెట్టడం వల్ల చాలామంది సింపతీ కోసం అలా చేశానని అనుకున్నారని వెల్లడించింది.

కానీ సినిమాకు తను కచ్చితంగా ప్రచారం చేయాల్సిన సమయం వచ్చిందని, ఆ టైమ్ లో తను ప్రమోట్ చేయకపోతే సినిమా చచ్చిపోతుందని వెల్లడించింది సమంత. అలా అని నీరసంగా మీడియా ముందుకు రాలేనని, అప్పటికే తన  ఆరోగ్య స్థితిపై చాలా పుకార్లు, కథనాలు వచ్చాయని.. దీంతో ముందుగా వివరణ ఇచ్చి, తర్వాత మీడియా ముందుకు వచ్చానని తెలిపింది.

తను చేసిన పని కొంతమందికి అర్థంకాక ట్రోల్ చేశారని.. ఆ టైమ్ లో మరింత ఒత్తిడికి గురయ్యానని సమంత చెప్పుకొచ్చింది. మయొసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న ఈ ముద్దుగుమ్మ, త్వరలోనే మళ్లీ సినిమాల్లోకి రానుంది.