హీరోయిన్ హిట్టిస్తే ఇండస్ట్రీ ఆమె వెంట పడుతుంది. ఒక్కసారి లక్కీ హ్యాండ్ అనే ముద్ర పడిందంటే, సదరు హీరోయిన్ లైఫ్ సెట్ అయిపోయినట్టే. వరుసపెట్టి అవకాశాలు, కళ్లుచెదిరే పారితోషికం క్యూ కడతాయి. ఇప్పటికే శ్రీలీల హవా నడుస్తోంది. ఇప్పుడు సంయుక్త మీనన్ వంతు వచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్ అంతా సంయుక్త వెంట పడుతోంది. దీనికి కారణం ఆమెకు గోల్డెన్ హ్యాండ్ ఇమేజ్ రావడమే. టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసినప్పట్నుంచి ఇప్పటివరకు ఆమెకు ఫ్లాప్ పడలేదు
భీమ్లానాయక్, బింబిసార, సర్.. ఇలా తెలుగులో సంయుక్త నటించిన ప్రతి సినిమా హిట్టయింది. దీన్ని కొనసాగిస్తూ, తాజాగా విరూపాక్షతో మరో సక్సెస్ అందుకుంది ఈ కేరళ బ్యూటీ. దీంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సంయుక్త ఉంటే సినిమా హిట్ అనే టాక్ వచ్చేసింది.
ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది విరూపాక్ష సినిమా. మొదటి రోజు కంటే రెండో రోజు ఈ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా హాఫ్-మిలియన్ మార్క్ దాటింది.