సంక్రాంతికి అన్నీ సెట్ అవుతాయా?

సినిమా థియేటర్లు తెరుచుకోమని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా కానీ ఇంతవరకు కొత్త సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు ధైర్యం చేయలేదు. సినిమా బిజినెస్‌కు చాలా కీలకమయిన దసరా సీజన్‌ను అలా వదిలేసారు. సంక్రాంతికి పరిస్థితులు…

సినిమా థియేటర్లు తెరుచుకోమని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా కానీ ఇంతవరకు కొత్త సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు ధైర్యం చేయలేదు. సినిమా బిజినెస్‌కు చాలా కీలకమయిన దసరా సీజన్‌ను అలా వదిలేసారు. సంక్రాంతికి పరిస్థితులు మెరుగవుతాయనే నమ్మకంతో పలువురు నిర్మాతలు తమ చిత్రాలను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు.

అయితే సంక్రాంతి నాటికి సినిమా బిజినెస్ మునుపటి స్థితికి వస్తుందా అంటే ఎవరి దగ్గరా ఆన్సర్ లేదు. ఏదో ఒక టైమ్‌లో రిస్క్ తీసుకుని అసలు సిట్యువేషన్ ఏమిటనేది తెలుసుకోక తప్పదు. అయితే ఇక్కడో చిన్న చిక్కు. సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే ఆలోచన వున్నపుడు ఒకటో రెండో విడుదల చేసుకోవాలి కానీ అయిదారు చిత్రాలు ఒకేసారి విడుదల చేయడం తగదు.

ఎప్పటిలా సంక్రాంతికి అన్ని సినిమాలకు సరిపడా స్పేస్ ఈసారి వుండదు. కానీ ఎక్కడ పండగ అడ్వాంటేజ్ వేరొకరు కొట్టేస్తారో అన్నట్టు అందరూ పండగ రిలీజ్‌పై కర్చీఫ్ వేసారు. ఇదిలావుంటే డిసెంబర్ నాటికి ఇండియాలో కరోనా సెకరడ్ వేవ్ వుంటుందని భయపెడుతున్నారు. అదే జరిగితే వేసవి వరకు సినిమాల ఊసుండదు.