సంతోష్..ప్రేమ్ కుమార్

యంగ్ హీరో సంతోష్ శోభన్ చకచకా సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా ప్రేమ్ కుమార్ అనే సినిమా స్టార్ట్ చేసాడు. అభిషేక్ మహర్షి దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాకు శివప్రసాద్ పన్నీరు నిర్మాత.  Advertisement…

యంగ్ హీరో సంతోష్ శోభన్ చకచకా సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా ప్రేమ్ కుమార్ అనే సినిమా స్టార్ట్ చేసాడు. అభిషేక్ మహర్షి దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాకు శివప్రసాద్ పన్నీరు నిర్మాత. 

ఈ సినిమా కోసం ఓ పాటను పిక్చరైజ్ చేసారు. ఈ పాటను సినిమా ప్రమోషన్ కోసం ముందుగా విడుదల చేసారు. నీలాంబరీ..చూసి నీ కళ్లలో, మేఘామృతం..జారే నా గుండెలో..అంటూ సాగే ఈపాటను కిట్టు విస్సా ప్రగడ రచించారు.

ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సందర్భంగా నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ “ఈ రోజు విడుదల చేసిన 'నీలాంబరం' పాటకు అద్భుత స్పందన లభిస్తోంది. మంచి మెలోడీ అని శ్రోతలు చెబుతున్నారు. త్వరలో మిగతా పాటలను విడుదల చేయాలని అనుకుంటున్నాం. 

ఇదొక హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి చక్కటి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం” అని అన్నారు.

దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ “ప్రేమ్ కుమార్ పాత్రలో సంతోష్ శోభన్ కనిపిస్తారు. పీటల మీద పెళ్లి ఆగితే… ప్రేమ్ కుమార్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాలు… సినిమాలో అన్నీ ఉన్నాయి. 'నీలాంబరం…' పాట అందరినీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.