హీరోయిన్ ఒక్కసారి క్లిక్ అయితే ఆమె జీవితం, సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో సామాన్యుడు ఊహించలేడు. నిన్నగాక మొన్నొచ్చిన సారా అలీఖాన్ జీవితమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ.. క్రేజ్ లో, క్యాష్ లో ఇతర హీరోయిన్లు అసూయ పడే రేంజ్ కు ఎదిగిపోయింది.
సారా అలీఖాన్ తన కెరీర్ స్టార్ట్ చేయకముందే క్రేజ్ కంటిన్యూ చేసింది. దీనికి కారణం ఆమె సైఫ్ అలీఖాన్ కూతురు కావడమే. ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, చాలా తక్కువ టైమ్ లోనే తన క్రేజ్ ను డబుల్ చేసుకుంది. వరుస సినిమాలు, ఫొటో షూట్స్, యాడ్స్ తో తారాజువ్వలా దూసుకుపోయింది.
ప్రస్తుతం సారా అలీఖాన్ నికర విలువ (నెట్ వర్త్) అక్షరాలా 29 కోట్ల రూపాయలు. ఆమె నెల సంపాదన 50 లక్షల రూపాయల పైమాటే.
ఏ రేంజ్ లో సంపాదిస్తుందో, అదే రేంజ్ లో రిచ్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది సారా అలీఖాన్. ఆమె వాడేవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్సే. మరీ ముఖ్యంగా సారా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. ఆమధ్య బర్బెర్రీ బ్రాండ్ కు చెందిన పింక్ కలర్ బ్యాగ్ లో కనిపించింది సారా. దాని ఖరీదు అక్షరాలా 74వేల రూపాయలు.
ఇది మాత్రమే కాదు, ఆమె దగ్గర బొటెగా వెనెటా మిలానో కు చెందిన మరో ఎరుపు రంగు బ్యాగ్ కూడా ఉంది. దాని రేటు అచ్చంగా 6 లక్షల రూపాయలు. ఆమధ్య నటుడు కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ సినిమా ప్రమోషన్ లో పాల్గొంది సారా. ఆ టైమ్ లో ఆమె ధరించిన బ్లూ కలర్ వాచ్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. దాని రేటు అక్షరాలా 9 లక్షల రూపాయలు.
ఇలా నెలకు లక్షల్లో సంపాదిస్తూ, అదే రేంజ్ లో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తోంది సారా అలీఖాన్. ప్రస్తుతం సారా అలీఖాన్ చేతిలో 2 బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి.