‘సరిలేరు’లో జబర్దస్త్ బ్యాచ్

కామెడీ టైమింగ్ లో, మాస్ కామెడీ అందించడంలో అనిల్ రావిపూడి ది సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్. అందులో సందేహం లేదు. మహేష్ తో తయారుచేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఈ ట్రాక్…

కామెడీ టైమింగ్ లో, మాస్ కామెడీ అందించడంలో అనిల్ రావిపూడి ది సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్. అందులో సందేహం లేదు. మహేష్ తో తయారుచేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఈ ట్రాక్ రికార్డును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలో 39 నిమషాల ట్రయిన్ సీన్ ను హిల్లేరియస్ గా రూపొందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఈ ట్రయిన్ జర్నీలోనే హీరోయిన్ ఫ్యామిలీ అంతా కలిసి హీరోను పడేసి, అమ్మాయి (రష్మిక)ను కట్టబెట్టేందుకు చేసే ఫన్నీ ఫీట్లు, ఒక ఫైట్ కూడా వుంటాయని తెలుస్తోంది.

ఇదే ట్రయిన్ ఎపిసోడ్ లో జబర్దస్త్ నటులు చమ్మక్ చంద్ర, అప్పారావుల సీన్లు హిలేరియస్ గా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వాళ్ల ఎపిసోడ్ లు ఫుల్ మాస్ ఎంటర్ టైన్ గా వుంటాయని, దొంగగా బండ్ల గణేష్ కూడా మాంచి ఫన్ అందించాడని తెలుస్తోంది.

ఇదిలా వుంటే సినిమా ఓపెనింగ్ లో తీసిన హీరో యాక్షన్ సీన్లు సినిమాకు మాంచి కిక్ స్టార్ట్ ఇచ్చేలా వచ్చాయని కూడా తెలుస్తోంది. సినిమా మెయిన్ థీమ్ తో సంబంధం లేకపోయినా, హీరో వృత్తి, పరిచయం అన్న బ్యాక్ డ్రాప్ లో ఈ యాక్షన్ సీన్ ను కాశ్మీర్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 

సినిమాకు తమన్నా ఐటమ్ సాంగ్ కూడా మాంచి ప్లస్ అవుతుందని, అది చాలా బాగా వస్తుందని, రావాలని దర్శకుడు అనిల్ రావిపూడి చాలాకేర్ తీసుకుంటున్నట్లు బోగట్టా.