రెండున్నర గంటలు ‘సరిపోదా’?

కంటెంట్ సూపర్ గా ఉందనే నమ్మకంతో రన్ టైమ్ పట్టించుకోవడం మానేశారు మేకర్స్. పెద్ద సినిమాలన్నీ రెండున్నర గంటల నిడివి దాటేస్తున్నాయి. ఈ క్రమంలో భారీ నిడివితో హిట్ కొట్టిన సినిమాలు కొన్ని ఉంటే,…

కంటెంట్ సూపర్ గా ఉందనే నమ్మకంతో రన్ టైమ్ పట్టించుకోవడం మానేశారు మేకర్స్. పెద్ద సినిమాలన్నీ రెండున్నర గంటల నిడివి దాటేస్తున్నాయి. ఈ క్రమంలో భారీ నిడివితో హిట్ కొట్టిన సినిమాలు కొన్ని ఉంటే, బోల్తాకొట్టిన సినిమాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. తీరా రిజల్ట్ తేడా కొట్టిన తర్వాత ట్రిమ్ చేశాం, థియేటర్లకు రండి అని పిలవడం కూడా కామన్ అయిపోయింది.

ఇప్పుడిదంతా ఎందుకంటే, సరిపోదా శనివారం సినిమా కూడా కాస్త భారీగానే వస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ అటుఇటుగా 2 గంటల 50 నిమిషాలు. రిలీజ్ టైమ్ మరో 4-5 నిమిషాలు ట్రిమ్ చేస్తారేమో చూడాలి. సెన్సార్ వెర్షన్ చేతిలో ఉంది.

ఇంతకుముందు నాని-వివేక్ ఆత్రేయ కలిసి ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేశారు. ఆ సినిమా రన్ టైమ్ కూడా ఎక్కువే. దానిపై అప్పట్లో విమర్శలు కూడా చెలరేగాయి. కానీ మేకర్స్ మాత్రం ట్రిమ్మింగ్ కు ససేమిరా అన్నారు. రిజల్ట్ తేడా కొట్టింది. ఇప్పటికీ అది బెస్ట్ మూవీ అంటాడు నాని, అదే వేరే విషయం.

ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం కూడా రెండున్నర గంటల రన్ టైమ్ దాటేసింది. అప్పుడు సెన్సిబుల్ మూవీ తీసిన ఈ జంట, ఈసారి యాక్షన్ మూవీ చేసింది. సినిమాలో సూర్య అనే వ్యక్తితో కలిసి ప్రేక్షకుడు ఎమోషనల్ జర్నీ చేస్తాడని నాని చెబుతున్నాడు.

నిజంగా అంత ఎమోషనల్ గా ఉంటే ఈ నిడివి సమస్యే కాదు. ఎందుకంటే, కంటెంట్ కనెక్ట్ అయిన అయిన ప్రేక్షకుడు, ఇంతకంటే ఎక్కువ నిడివి ఉన్న సినిమాల్నే హిట్ చేశాడు. కానీ ఏమాత్రం డిస్-కనెక్ట్ అయినా మొదటికే మోసం వస్తుంది.

11 Replies to “రెండున్నర గంటలు ‘సరిపోదా’?”

  1. ప్రేక్షకులు ‘దూల తీరిందా-నీకు నమస్కారం’ అని తీర్పునిచ్చేలా లేకుంటే చాలు సినిమా’

  2. పర్జ్ అనే కల్ట్ మూవీస్ కాన్సెప్ట్ లాగ అనిపిస్తూ ఉంది.

    సంవత్సరం లో ఒక రోజు పాటు అమెరికా లో పోలీసు వ్యవస్థ పని చేయదు. ఆ రోజు ( 24 గంట ల పాటు) ఎవరు ఎవరినీ చంపిన కూడా కే*సు వుండదు. ఆ రోజు న అందరూ ఇళ్లలో డోర్ కి తాళాలు వేసుకుని డాక్కుంటారు. వేరే వాళ్ళు వచ్చి వారిని చంప కుండా.

    తమ కి నష్టం చేసిన వాళ్ళ మీద ఆ రోజు పగ తీర్చుకోవడానికి అందరూ ట్రై చేస్తారు.

    24 గంటలుందాటగానే సైరన్ మొగుతుంది, పోలీసు లు డ్యూటీ మొదలు పెడతారు, అప్పుడు మాత్రం ఏమి నేరం చెయ్యకూడదు.

Comments are closed.