హీరో మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట సినిమా నుంచి చిన్న విడియో బైట్ వచ్చింది.
ఈ రోజు మహేష్ బాబు బర్త్ డే. కానీ కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ కానీ, మిగిలిన వ్యవహారాలు కానీ ఏవీ ఇంకా ప్రారంభం కాలేదు.
అందువల్ల ఫ్యాన్స్ ను హుషారు చేయడానికి ఏదైనా కంటెంట్ ఇవ్వాలన్నా ఏమీ లేదు. కానీ బర్త్ కే సందర్భంగా ఫ్యాన్స్ ను నిరాశ పర్చకూడదు. అందుకే ఓ చిన్న విడియో కట్ చేసారు.
రూపాయి కాయిన్ ను టాస్ వేస్తున్న హీరో చేతిని, దానికి వున్న ఓం లాకెట్ ను చూపించారు. ఓ విధంగా సినిమా టైటిల్ కార్డు మోషన్ పోస్టర్ ను మరి కాస్త డెవలప్ చేసి విడియో బైట్ చేసారు. ఈ బైట్ కు ఫుల్ ఫామ్ లో వున్న మ్యూజిక్ డైరక్టర్ థమన్ సంగీతం అందించారు.
పరుశురామ్ డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమా ఫుల్ దూకుడు మీద వుందని అని అనిపించేలా…సర్కారువారి పాట…సర్కారువారి పాట అనే వాయిస్ ను విడియో బైట్ బ్యాక్ గ్రవుండ్ లో యాడ్ చేసారు.
అది వింటుంటే, 'ఈ దూకుడూ' అనే సెంటిమెంట్ ధ్వనిస్తోంది. థమన్ సూపర్ హిట్ ఆల్పమ్ కదా అది.