శర్వా సరసన ఇద్దరు హీరోయిన్లు

శర్వానంద్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమాకు సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు పని చేస్తారు. ఈ మేరకు కథ ఓకె అయింది. Advertisement ఈ సినిమా…

శర్వానంద్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమాకు సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు పని చేస్తారు. ఈ మేరకు కథ ఓకె అయింది.

ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు. లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ ఓ హీరోయిన్. ఏజెంట్ సినిమాలో నటించిన సాక్షి వైద్య మరో హీరోయిన్. ఏజెంట్ సినిమా కూడా ఇదే బ్యానర్ లో తయరైంది. అప్పట్లోనే సాక్షి వైద్య మరో సినిమా చేసే అగ్రిమెంట్ కుదిరింది.

శర్వానంద్ ప్రస్తుతం ఓ సినిమాను పీపుల్స్ మీడియా సంస్థలో చేస్తున్నారు. అది దాదాపు పూర్తి కావచ్చింది. దాని తరువాత ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా ప్రారంభమవుతుంది. పూర్తిగా యూత్ పుల్ రోమ్ కామ్ జానర్ లో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసారు. ఏజెంట్ సినిమా తరువాత అనిల్ సుంకర నిర్మించే సినిమా ఇది. గతంలో ఇదే నిర్మాత, హీరో కాంబినేషన్ లో మహాసముద్రం సినిమా వచ్చింది.

సంయుక్త మీనన్ ఒక సినిమా తరువాత మరో సినిమా వస్తూ, కెరీర్ ముందుకు సాగుతూనే వుంది. సాక్షి వైద్య కు మాత్రం ఏజెంట్ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో అవకాశాలు పెద్దగా రాలేదు. ఈ సినిమాతో ఆమె కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం వుంది.