ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎదుగుతున్న హీరో సత్యదేవ్. చకచకా సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా గోపి గణేష్ పట్టాభి డైరక్షన్ లో చేయబోతున్న సినిమాకు గాడ్సే అనే టైటిల్ ఫిక్స్ చేసారు.
గతంలో సత్యదేవ్ ను తన జ్యోతిలక్ష్మి సినిమాలో విలక్షణ పాత్రలో చూపించిన నిర్మాత సి. కళ్యాణ్ నే ఈ సినిమానూ నిర్మిస్తున్నారు.
అలాగే గతంలో సత్యదేవ్-గోపీ గణేష్ కలిసి బ్లఫ్ మాస్టర్ సినిమా చేసారు. ఆ సినిమాలో సత్యదేవ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు.
సీరియస్ లుక్, గన్స్ బ్యాక్ గ్రవుండ్, గాడ్సే అనే టైటిల్ అన్నీ కలిసి సినిమా ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ గా వుండబోతోందని చెప్పకనే చెబుతున్నాయి.
నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్యమీనన్ తదితరులు నటించే ఈ సినిమాకు హీరోయిన్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. డైరక్టర్ గోపీగణేష్ నే కథ మాటలు కూడా అందిస్తున్నారు.