సెహరి అంటే సెలబ్రేషన్

సెహరి అనే సినిమా వస్తోంది. హర్ష్ కానుమిల్లి అనే కొత్త హీరో నటిస్తున్నఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్. ఇంతకీ సెహరి అంటే ఏమిటి అని చాలా మందికి సందేహం.  Advertisement ఇలా సందేహం…

సెహరి అనే సినిమా వస్తోంది. హర్ష్ కానుమిల్లి అనే కొత్త హీరో నటిస్తున్నఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్. ఇంతకీ సెహరి అంటే ఏమిటి అని చాలా మందికి సందేహం. 

ఇలా సందేహం వుందేమో అని మేకర్లకు కూడా సందేహం వచ్చిందేమో..ట్రయిలర్ లో క్లారిటీ ఇచ్చారు. సెహరి అంటే తెలీదా..సెహరి అంటే సెలబ్రేషన్ అని. హమ్మయ్య..ఓ విషయం తెలిసింది.

ఇక ట్రయిలర్ విషయానికి వస్తే. ఓ కుర్రాడు తన సోల్ మేట్ ను వెదుక్కునే జ‌ర్నీనే సినిమా కథగా అర్థం అవుతోంది. ఆ కుర్రాడి వెనుక అభినవ్ గోమటం లాంటి వాళ్లతో కూడిన బ్యాచ్ కూడా వుంది. 

ఈ కుర్రాడి అమాయకత్వం, ఆ కుర్రాళ్ల అల్లరితనం మొత్తం మీద వరుస బ్రేక్ అప్ లు, ఆఖరికి సెట్ అయిన సంబంధం ఇలా వుంది ఆర్డర్. కానీ అక్కడే మళ్లీ జ‌ల్సా సినిమాలో మాదిరిగా ఓ ట్విస్ట్. ఈ కుదిరిన అమ్మాయి ఎవరో కాదు, మాజీ ప్రేయసి సిస్టర్. పైగా నాలుగేళ్లు పెద్ద.  ఇక అప్పుడేమయింది అన్నది సినిమా.

సాగర్ ద్వారక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.అద్వయ జిష్ణు రెడ్డి నిర్మాత. హీరో హర్ష్ కానుమిల్లి సినిమాకు రచయితగా కూడా పనిచేయడం విశేషం. ప్రశాంత్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలోకి వస్తుంది.