శేఖర్ కమ్ముల అనగానే ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు కళ్ల ముందుకు వస్తాయి. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తనకంటూ ఓ స్టయిల్ ను తెచ్చుకున్నారు. మధ్యలో ఓ రీమేక్ చేసారు. అది వేరే సంగతి.
లవ్ స్టోరీ లాంటి మంచి హిట్ కొట్టిన తరువాత కూడా సరైన స్క్రిప్ట్ తయారీ కోసం అలా వర్క్ చేస్తూనే వున్నారు. నిర్మాత రెడీ.హీరో రెడీ అయినా కూడా. ఆఖరికి ఆ ముహుర్తం రానే వచ్చింది, ఈ రోజు పూజా కార్యక్రమాలు జరిగాయి.
హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమా తీయబోతున్నారు. శేఖర్ కమ్ముల స్టయిల్ సినిమా ధనుష్ కు నప్పుతుందా? ఇవీ ప్రశ్నలు. శేఖర్ కమ్ముల ఈసారి ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నారు. ఓ స్కాము చుట్టూ తిరిగే కథ ఇది అని తెలుస్తోంది. ధనుష్ కు పక్కాగా నప్పే కథ ఇది. ఇద్దరు హీరోయిన్లు వుంటారు. వీరిని ఇంకా ఫైనల్ చేయాల్సి వుంది. శేఖర్ కమ్ముల స్టయిల్ ఎమోషన్లు కూడా పుష్కలంగా వుంటాయి.
ధనుష్ పాత్ర కాకుండా మరో కీలకపాత్ర కూడా సినిమాలో వుంటుంది. నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యత వుంటుంది. జనవరి నుంచి సెట్ మీదకు వెళ్తుందీ సినిమా. రామ్మోహనరావు, సునీల్ నారంగ్ నిర్మాతలు.