మరో కలకలం.. జూనియర్ ఎన్టీఆర్ పై మళ్లీ ఫ్లెక్సీ

పండగలకు ఫ్లెక్సీలు కామన్. పల్లెల్లో ఈ కల్టర్ మరీ ఎక్కువైంది. ఇందులో హీరోలకు అగ్రతాంబూలం ఇస్తుంటారు ఫ్యాన్స్. అలాంటిదే ఈ ఫ్లెక్సీ కూడా. దసరా సందర్భంగా పల్నాడు జిల్లాలో వెలిసిన ఈ ఫ్లెక్సీ ప్రస్తు…

పండగలకు ఫ్లెక్సీలు కామన్. పల్లెల్లో ఈ కల్టర్ మరీ ఎక్కువైంది. ఇందులో హీరోలకు అగ్రతాంబూలం ఇస్తుంటారు ఫ్యాన్స్. అలాంటిదే ఈ ఫ్లెక్సీ కూడా. దసరా సందర్భంగా పల్నాడు జిల్లాలో వెలిసిన ఈ ఫ్లెక్సీ ప్రస్తు తం కలకలం రేపుతోంది.

జిల్లాలోని వెల్లటూరులో గుర్తుతెలియని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు ఓ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. ఆ ఫ్లెక్సీలో తమ హీరో ఎన్టీఆర్ ను సమర్థిస్తూనే, టీడీపీ నాయకులు కొందరికి గడ్డిపెట్టారు. ఎన్టీఆర్ ను, రాజకీయాలను కలిపి చూడొద్దంటూ ఘాటుగా తమ కామెంట్ రాశారు.

“ఒక మనిషి మౌనం వెనక బోలెడు కారణాలు ఉండొచ్చు. సందు  దొరికితే బురద జల్లే మీరు స్పందించమంటారు. స్పందించిన తర్వాత నోటికి ఏదొస్తే అది వాగుతారు. దయచేసి మీరు ఎన్టీఆర్ గురించి ఎంత మొరగడం తగ్గించుకుంటే అంత బాగుంటుంది. రాజకీయంలోకి ఎన్టీఆర్ ను లాగొద్దు, మీ పని మీరు చూసుకోండి..”. ఇలా సూటిగా సుత్తిలేకుండా ఫ్లెక్సీపై దర్శనమిచ్చిన సందేశం ఇది.

చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత చాలామంది టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కారు. ఎన్టీఆర్ స్పందించలేదంటూ తెగ పిసుక్కున్నారు. బాలకృష్ణ అయితే ఓ అడుగు ముందుకేసి “ఎవరు ఖండించకపోయినా నేను పట్టించుకోను, ఐ డోంట్ కేర్” అంటూ తనదైన శైలిలో గర్వంగా కామెంట్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై వెల్లటూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు పేరును నేరుగా ప్రస్తావించకుండా.. రాజకీయాల్లోకి లాగొద్దని, మీ పని మీరు చూసుకోండంటూ గడ్డిపెట్టారు. ఎన్టీఆర్ గురించి మొరగడం తగ్గించుకుంటే మంచిదంటూ ఫ్లెక్సీ ఏర్పాటుచేసి, కొంతమంది నాయకుల్ని కుక్కలతో పోల్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఎన్టీఆర్ పై ఫ్లెక్సీలు కొత్తేం కాదు. గతంలో చంద్రబాబు, లోకేష్ కుప్పంలో పర్యటించినప్పుడు వాళ్లు పర్యటించే ప్రాంతాల్లోనే ఎన్టీఆర్ కు అనుకూలంగా ఫ్లెక్సీలు పెట్టారు. చంద్రబాబు పర్యటనలో సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు కూడా చేశారు. జెండా దిమ్మెపై ఎన్టీఆర్ జెండా ఎగరవేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండేసరికి, అతడ్ని రాజకీయాల్లోకి లాగొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాడు అతడి ఫ్యాన్స్.