టీడీపీని రంజింప‌జేస్తున్న శృంగార తార‌

అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా ఎవ‌రు మాట్లాడినా టీడీపీ నెత్తిన  పెట్టుకుంటోంది. చంద్ర‌బాబే ముద్దాడుతుంటే….ఇక ఎల్లో మీడియా గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంటుంది. గ‌త 50 రోజులుగా రాజ‌ధాని ఆందోళ‌న‌ల‌పై చంద్ర‌బాబు, ఆయ‌న భ‌గ‌వ‌ద్గీతగా భావించే ప‌త్రిక‌లు, చాన‌ళ్లు…

అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా ఎవ‌రు మాట్లాడినా టీడీపీ నెత్తిన  పెట్టుకుంటోంది. చంద్ర‌బాబే ముద్దాడుతుంటే….ఇక ఎల్లో మీడియా గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంటుంది. గ‌త 50 రోజులుగా రాజ‌ధాని ఆందోళ‌న‌ల‌పై చంద్ర‌బాబు, ఆయ‌న భ‌గ‌వ‌ద్గీతగా భావించే ప‌త్రిక‌లు, చాన‌ళ్లు క‌థ‌నాల‌ను ఎలా ప్ర‌చురిస్తున్నాయో, ప్ర‌సారం చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం.

తాజాగా టీడీపీ ‘ఒక రాష్ట్రం – ఒక రాజ‌ధాని’ నినాదానికి శృంగార తార ష‌కీలా మ‌ద్ద‌తు ప‌లికింది. ష‌కీలా అంత‌టి న‌టి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో టీడీపీ కిల‌కిల‌మంటోంది. ఇక టీడీపీ సోష‌ల్ మీడియా, ఎల్లో మీడియాలైతే ష‌కీలా జోక్యంతో మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ ఆగిపోతుందేమోనంత హ‌డావుడి చేస్తున్నాయి.

షకీలా నటించిన సినిమా (షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం) ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో ఓ స‌న్నివేశంలో షకీలా పేపర్‌ చదువుతుంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులనే వార్త ఆమె కంట‌ప‌డుతుంది. దీంతో ఆశ్చ‌ర్యానికి లోనైన ఆమె… ‘ఇదేంటి? మూడు రాజధానులా?’ అని తన అసిస్టెంట్‌ని అడుగుతుంది.

‘అవును మేడం! జగనన్న మూడు రాజధానులు చేసేశాడు’ అని అసిస్టెంట్‌ చెప్తాడు. అసిస్టెంట్ మాట‌ల‌కు స్పందిస్తూ ‘పోను పోనూ ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యం అవసరం లేదు’ అని షకీలా వ్యంగ్యంగా అంటుంది. ష‌కీలా మాట‌ల‌ను సోషల్‌ మీడియాలో ఎల్లో బ్యాచ్  షేర్ చేస్తూ హ‌డావుడి సృష్టిస్తోంది.

మొత్తానికి ష‌కీలాతో టీడీపీ ఈ విధంగా ‘రాజ‌ధాని’ లీల‌లకు దిగింది. కొన్నేళ్లుగా త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డ్డ ష‌కీలా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కిష్ట‌మైన చిత్రాల్లో న‌టిస్తూ యువ‌త‌ను రంజింప చేస్తూ, శృంగార‌తార‌గా పేరు గాంచింది. మొట్ట మొద‌ట‌గా ఆమె కుటుంబ క‌థా చిత్రానికి క‌థ‌ రాసి, అందులో న‌టించి….టీడీపీని రంజింప చేస్తోంది. అలాగే మొట్ట‌మొద‌ట‌గా టీడీపీ నినాదాన్ని ఎత్తుకుని ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేసింది. శృంగార తార ష‌కీలా, టీడీపీ భావాలు, మ‌న‌సులు  ప‌ర‌స్ప‌రం పాలు నీళ్ల‌లా క‌లిసిపోవ‌డానికి  ‘రాజ‌ధాని’ అంశం దోహ‌ద‌ప‌డింది.