తనకు బిడ్డ కావాలి…భర్త కాదని ఓ అమ్మడు కోరుకుంటోంది. ‘శకుంతలాదేవి’గా ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్న ఆ బ్యూటీ విద్యాబాలన్ ఆకాంక్షే ఇది. ‘హ్యూమన్ కంప్యూటర్’గా ‘శకుంతలాదేవి’ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించు కున్నారు.
శకుంతలాదేవిలో అనేక కోణాలున్నాయి. ఆమెలో ఓ రాజకీయవేత్త, జ్యోతిషురాలు కూడా ఉన్నారు. అంతేకాదడోయ్ ఆమెలో మంచి కమెడియన్ కూడా ఉన్నారు. ఆమె జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ నెల 31న ‘శకుంతలాదేవి’ బయోపిక్ విడుదల కానుంది. శకుంతలాదేవి పాత్రలో కీ రోల్ పోషించిన విద్యాబాలన్ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
తాను సిల్క్ స్మితలా కనిపించను కానీ, ‘డర్టీ పిక్చర్’ చేసినట్టు ఆమె తెలిపారు. అలాగే శకుంతలాదేవిలా ఉండనని, కానీ ఆమె బయోపిక్‌లో నటించినట్టు చెప్పుకొచ్చారు. తన దృష్టిలో పోలికల కంటే కథలో ఆత్మను, వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కృరించడం ముఖ్యమన్నారు.
సినిమా ట్రైలర్ గురించి విద్యాబాలన్ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. శకుంతలాదేవి ట్రైలర్ విడుదల తర్వాత విద్యాబాలన్ ఉంటే తప్పక బావుంటుందని తనతో చెప్పేవారన్నారు. ప్రేక్షకులు మెచ్చేలా నటించేందుకు ప్రయత్నించానన్నారు. ఇక ప్రేక్షకుల చేతుల్లో అంతా ఉందన్నారు.
‘శకుంతలా దేవి’ ట్రైలర్లో ‘బేబీ చాహియే థా… పతి నహీ’ (బిడ్డ కావాలి… భర్త కాదు) అనే డైలాగ్ గుర్తు చేస్తూ విద్యాబాలన్ గట్టిగా నవ్వారు. ఆ డైలాగ్ వినగానే ‘అది నేనే కదా! దట్స్ మీ’ అనిపించినట్టు ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారామె. తన భర్త సిద్ధార్థ్ తో తాను ఆ మాట చెప్పలేదన్నారు. అలాగే, ప్రజలు ఇబ్బందిగా భావించే మాటలు కొన్ని ఉన్నాయన్నారు. అమ్మో…అని ఆశ్యర్యంతో ముక్కున వేలు వేసుకునే డైలాగ్‌లు చెప్పానన్నారు. శకుంతలాదేవి సెన్సాఫ్ హ్యూమర్ కొంచెం ఇబ్బందిగా, చెత్తగా ఉంటుందన్నారు.