నెల నుంచి తను బార్సిలోనాలో ఉన్నట్టుగా చెబుతోంది నటి శ్రియ. బార్సిలోనా ఉన్నది మరెక్కడో కాదు, కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న స్పెయిన్ లో! కరోనా చేత తీవ్రంగా బాధింపబడుతున్న దేశంలో ఒకటిగా ఉంది స్పెయిన్. ఇటలీ తర్వాత యూరప్ లో స్పెయిన్ లోనే కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోనే అతిగా కరోనా చేత బాధింపబడుతున్న దేశాల్లో కూడా స్పెయిన్ ముందువరసలో ఉంది. అక్కడ తను నెల రోజుల నుంచి ఉన్నట్టుగా శ్రియ సోషల్ మీడియా ద్వారా చెబుతోంది.
మార్చి 13న తనభర్తతో కలిసి అక్కడే వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుందట శ్రియ. ఆ సమయం నుంచినే అక్కడ కరోనా విజృంభిస్తూ ఉంది. దీంతో నెల రోజుల నుంచి ఇళ్లు దాటింది లేదట శ్రియ. ఒక విదేశీయుడిని ఈమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతూ ఉంది. విరామాల్లో భర్తతో గడుపుతూ ఉంది. ఇలాంటి క్రమంలో ఈమె భర్తతో కలిసి బార్సిలోనాలో లాక్ డౌన్ అయిపోయినట్టుగా ఉంది.
కరోనా నెల రోజుల్లో పరిస్థితులను ఎలా తలకిందుల చేసిందో తను దగ్గర నుంచి గమనిస్తున్నట్టుగా శ్రియ చెబుతోంది. స్పెయిన్ లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి.. అక్కడ పరిస్థితులు చాలా మారిపోయాయి. ఈ విషయాన్నే ఈ హీరోయిన్ ప్రస్తావిస్తూ ఉంది. కరోనా ప్రభావం నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు కాస్త ముందుగానే అలర్ట్ అయ్యారు. యూరప్ టూర్లను వాళ్లు రద్దు చేసుకున్నారు. అయితే విదేశీయుడిని పెళ్లి చేసుకున్న శ్రియ మాత్రం ఫారెన్ లోనే చిక్కుకుపోయినట్టుగా ఉంది.