షూటింగ్ ల విషయంలో నెంబర్ వన్ ఆ హీరోనే

ఎన్ని సినిమాలు ఒప్పుకున్నామన్నది కాదు. ఎన్ని కోట్లకు కోట్లు నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు లాగేసామన్నది కాదు. సినిమాలు ఎంత చకచకా చేసాము అన్నది పాయింట్.  Advertisement ఎన్ని సినిమాలు విడుదల చేసి, నిర్మాతలకు…

ఎన్ని సినిమాలు ఒప్పుకున్నామన్నది కాదు. ఎన్ని కోట్లకు కోట్లు నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు లాగేసామన్నది కాదు. సినిమాలు ఎంత చకచకా చేసాము అన్నది పాయింట్. 

ఎన్ని సినిమాలు విడుదల చేసి, నిర్మాతలకు టెన్షన్ లేకుండా చేసాము అన్నది పాయింట్. ఈ విషయంలో సీనియర్ హీరో రవితేజకు ఫుల్ మార్కులు పడతాయి. 2022 లో మూడు సినిమాలు విడుదలయ్యాయి. 2023 లో కూడా మూడు లేదా అవకాశం వుంటే నాలుగు సినిమాలు విడుదలయ్యేలా వున్నాయి. ఇవి కాక మరో రెండు సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి.

డిసెంబర్ ఢమాకా విడుదలకు సన్నాహాలు చేసుకుంటూనే అటు రావణాసుర, ఇటు టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ లు చేసాడు. పనిలో పనిగా ఈగిల్ సినిమా కొంత వర్క్ చేసారు. ఇప్పుడు రావణాసుర సినిమా విడుదలకు రెడీ అవుతోంది. టైగర్ నాగేశ్వరరావు షూట్ కొద్దిగా బకాయి వుంది. ఈగిల్ సినిమా సమాంతరంగా రెడీ అయిపోతోంది.

ఈ లోగా మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఇది కాక మరో సినిమా ఒకె చేసే ఆలోచనలో వున్నారని బోగట్టా. అంటే సగటున ఏడాదికి నాలుగైదు సినిమాల మీద వర్క్ చేస్తున్నారు. కనీసం మూడు సినిమాలు విడుదల చేస్తున్నారు. రవితేజ తరువాత ఈ రేంజ్ లో సినిమాలు చేసే హీరో కనిపించడం లేదు. 

మెగాస్టార్ ఒక్కరే కాస్త బెటర్ ఈ విషయంలో. మిగిలిన హీరోలు అంతా ఒక్కో సినిమా మెలమెల్లగా చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు సులువుగా పనైపోయే సినిమాలు, భారీగా రెమ్యూనిరేషన్ అందుకునే సినిమాలు ఎంచుకుంటూ కూడా షూటింగ్ ల విషయంలో దారుణంగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.