Advertisement

Advertisement


Home > Movies - Movie News

'కృష్ణ'తో శ్రద్ధా ఇమేజ్ మారిపోతుందా?

'కృష్ణ'తో శ్రద్ధా ఇమేజ్ మారిపోతుందా?

శ్రద్ధా శ్రీనాథ్ పేరు చెప్పగానే "జెర్సీ" సినిమా గుర్తొస్తుంది. ఆమెకు తెలుగులో గుర్తింపు తెచ్చిన సినిమా అదే. అయితే ఆమె కెరీర్ కు కాస్త అడ్డంకిగా మారిన సినిమా కూడా అదే. అందులో ఓ బిడ్డకు తల్లిగా నటించడం ఆమెకు మైనస్ అయింది. ఆ తర్వాత ఆది సాయికుమార్ తో ఓ రొమాంటిక్ స్టోరీ చేసినా అది కూడా పెద్దగా కలిసిరాలేదు. అలా తెలుగులో గ్లామర్ పాత్రలకు, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ రోల్స్ కు దూరమైంది శ్రద్ధ.

ఎట్టకేలకు "జెర్సీ" ఇమేజ్ నుంచి బయటకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీనికి కారణం "కృష్ణ అండ్ హిజ్ లీల". ఈ సినిమాలో మోడ్రన్ అమ్మాయిగా మెరిసింది శ్రద్ధ. మరీ ఎక్స్ పోజింగ్ లాంటివి చేయకపోయినా.. సిగరెట్ తాగడం, మందు కొట్టడం లాంటివి టాలీవుడ్ లో ఆమెకు కొత్త ఇమేజ్ తీసుకొచ్చాయి.

దీనికితోడు సినిమాలో లిప్ కిస్సులు, ఓ బెడ్ రూమ్ సీన్ (చాలా చిన్నదే)లో కూడా నటించడంతో పూర్తిగా జెర్సీ ఇమేజ్ నుంచి ఆమె బయటకొచ్చినట్టయింది. ఇకపై శ్రద్ధాకు ఆఫర్లు ఇవ్వాలనుకునే టాలీవుడ్ మేకర్స్, ఆమెను జెర్సీ కోణంలో చూడరు.

అటు శ్రద్ధా కూడా ఓటీటీలో రిలీజైన "కృష్ణ అండ్ హిజ్ లీల" సినిమా తనకు మరిన్ని ఆఫర్లు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉంది. ప్రస్తుతం విశాల్ సరసన చక్ర అనే సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ.. కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటోంది. గ్యాప్ తర్వాత ఆమెకు తెలుగు నుంచి ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి..

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

ఇక నుంచి నో లంచం నో దళారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?