కెలుక్కోవడం ఎలా.. ఈ హీరోకు బాగా తెలుసు!

తన సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మాత్రమే సిద్దార్థ్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడనేది చాలామంది మాట.

సిద్దార్థ్ ఎక్కడుంటే వివాదం అక్కడ ఉంటుంది. ఒకవేళ అక్కడ వివాదం లేకపోతే, ఆయన సృష్టిస్తాడు. కోరి కెలుకుతాడు. ఏదో ఒక కామెంట్ చేస్తాడు. మొత్తానికి మీడియాను తనవైపు తిప్పుకుంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు అతడు క్షమాపణలు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఈసారి కూడా ఈ హీరో అదే పని చేశాడు. సోషల్ మీడియాలో ట్రోలర్స్ ను టార్గెట్ చేస్తూ వెధవలు అంటూ సంభోదించాడు.

“ఈ రోజుల్లో ప్రతిదానికి ట్రోల్ చేస్తున్నారు. పాత కాలం నుంచి ట్రోలింగ్ ఉంది. ఓ మంచి విషయం చెప్పినా పది మందిలో ఇద్దరు వెధవలు ఏదో ఒక ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఆ ఇద్దరు వెధవలకే ఎక్కువగా మైకులిస్తున్నాం మనం. వాళ్లకే ఎక్కువ ఫాలోవర్స్, లైకులు వస్తున్నాయి. దీంతో వాళ్లు స్టార్స్ అయిపోయారు. అలాంటి వెధవల్ని నేను ఎలా ట్రోల్ చేయాలో అర్థం కావడం లేదు.”

ఇలా మరోసారి వివాదం రేపే ప్రయత్నం చేశాడు సిద్దార్థ్. భారతీయుడు-2 సినిమా టైమ్ లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు సిద్దార్థ్. నటులకు సామాజిక బాధ్యత ఉంటుందని, ఎవరో చెబితే తెలుసుకునే స్థితిలో లేరంటూ తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా కామెంట్స్ చేశాడు, ఆ తర్వాత భేషరతుగా క్షమాపణలు చెప్పాడు.

అంతకంటే ముందు కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు తనను తొక్కేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2013 నుంచి 2023 వరకు పదేళ్లలో టాలీవుడ్ నుంచి కేవలం 3 కథలు మాత్రమే తన వద్దకు వచ్చాయన్నాడు. “15 తెలుగు సినిమాలు చేసిన హీరోగా టాలీవుడ్ గురించి ఏమైనా మాట్లాడే హక్కు నాకుంది. నా కామెంట్స్ నచ్చకపోతే ఓకే, అది మీ అభిప్రాయం. కానీ టాలీవుడ్ పై కామెంట్ చేయడానికి సిద్దార్థ్ ఎవడని ప్రశ్నిస్తే మాత్రం చెప్పుతో కొడతా.” అంటూ గతంలో ఓసారి కామెంట్ చేశాడు.

మరో సందర్భంలో “మసాలాగాళ్లతో మాట్లాడిన అవసరం నాకు లేదు” అంటూ కొంతమంది మీడియా వాళ్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతేడాది తన సినిమాకు కొంతమంది థియేటర్లు ఇవ్వడం లేదంటూ ఆరోపించాడు. తను సూటిగా మాట్లాడతానని, నిజాలు మాత్రమే చెబుతానని అంటుంటాడు సిద్దార్థ్. ఇలా చెప్పుకుంటూ పోతే సిద్దార్థ్ చుట్టూ చాలా వివాదాలున్నాయి.

అయితే తన సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మాత్రమే సిద్దార్థ్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడనేది చాలామంది మాట. ఇలా వివాదాలు రేపుతున్నప్పటికీ, అతడి సినిమాలు తెలుగులో ఆడడం లేదు. వివాదాలతో ఎటెక్షన్ క్రియేట్ అవుతుంది తప్ప, సినిమాలు సక్సెస్ అవ్వవనే విషయాన్ని సిద్ధూ ఎప్పటికి తెలుసుకుంటాడో.. అతడు తన మాటతీరు మార్చుకోనక్కర్లేదు, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటే చాలు.

10 Replies to “కెలుక్కోవడం ఎలా.. ఈ హీరోకు బాగా తెలుసు!”

  1. సిద్ధార్థ్ తన సిద్ధాంతాన్ని రాద్ధాంతంగా మార్చుకుంటున్నాడేమో….

Comments are closed.