Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫస్ట్ టైమ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు

ఫస్ట్ టైమ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు

సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. అయితే ఇకపై కూడా అతడు అలాంటి సినిమాలే చేస్తాడనుకుంటే పొరపాటు. విభిన్నంగా ఉంటూనే, డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాడు సిద్ధు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న జాక్ సినిమా కూడా అలాంటిదే.

బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో ఫస్ట్ టైమ్ యాక్షన్ ట్రై చేస్తున్నట్టు వెల్లడించాడు ఈ హీరో. రోప్ సాయంతో దూకడం, ఫైట్స్ చేయడం లాంటివి చాలా కొత్తగా ఉన్నాయని.. అయితే గాయాలు తప్పవని అంటున్నాడు. అదే గాయాలతో మరుసటి రోజు షూటింగ్ కు వెళ్తున్నానని తెలిపాడు.

అయితే యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఓ సంతృప్తి దక్కుతోందని తెలిపాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ లోనే ఓ చేతిలో నిజమైన తుపాకి, మరో చేతిలో బొమ్మ తుపాకీ పట్టుకొని పోజులిచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. అప్పుడు చాలామంది ఈ సినిమా యాక్షన్ జానర్ లో వస్తోందని ఊహించారు.

అది నిజమేనని ఈరోజు సిద్ధు క్లారిటీ ఇచ్చాడు. అయితే యాక్షన్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ మార్కు ఫన్ కూడా ఇందులో ఉంటుందని స్పష్టం చేశాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేశాడు సిద్ధు. త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం నేపాల్ వెళ్లబోతున్నాడు.

బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. టిల్లూ స్క్ర్వేర్ తర్వాత ఈ సినిమానే థియేటర్లలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?