రెండు కంపెనీలు కలిసినప్పుడు ఆటోమేటిగ్గా నెట్ వర్త్ పెరుగుతుంది. అలాగే ఇద్దరు స్టార్లు కలిసినప్పుడు కూడా ఆటోమేటిగ్గా ఆస్తి పెరుగుతుంది. ఇప్పుడు కియరా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా విషయంలో కూడా ఇదే జరిగింది. కియరా-సిద్ పెళ్లి చేసుకోవడంతో, వీళ్లిద్దరి ఉమ్మడి ఆస్తి ఇప్పుడు భారీగా పెరిగింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు సిద్దార్థ్ మల్హోత్రా. బాయ్ నెక్ట్స్ డోర్ లుక్స్ తో పాటు యూత్ కనెక్ట్ అవ్వడం ఇతడికి ప్లస్ పాయింట్. అలా పలు యాడ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు సిద్దార్థ్. ప్రస్తుతం ఈ హీరో ఒక్కో యాడ్ కు 3 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు.
ఇక సినిమాల విషయానికొస్తే, ఒక్కో సినిమాకు 7 నుంచి 8 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాడు సిద్దార్థ్. యావరేజ్ గా చూసుకుంటే, నెలకు సిద్దార్థ్ సంపాదన కోటిన్నర పైమాటే.
ఈ సంపాదనకు తోడు సిద్దార్థ్ కు ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. ముంబయిలో అతడికి విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. షారూక్ భార్య గౌరీఖాన్, సిద్ ఫ్లాట్ ను డిజైన్ చేసింది. దీంతో పాటు 2.26 కోట్ల రూపాయల రేంజ్ రోవర్ కారు, మరో 2 బెంజికార్లు ఇతడికి ఉన్నాయి.
ఇక కియరా అద్వానీ విషయానికొస్తే, ఈమె కూడా రెండు చేతుల సంపాదిస్తోంది. బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయలు తీసుకుంటుంది కియరా. ఇక ఆమె చేస్తున్న యాడ్స్ కు కొదవలేదు. వీటితో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా ఆమె బాగా సంపాదిస్తోంది. ఇక స్థిరాస్థి విషయానికొస్తే.. ముంబయిలో ఆమెకు 15 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్ ఉంది.
కియరా-సిద్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడీ జంట యావరేజ్ మంత్లీ ఇన్ కమ్ రెండున్నర కోట్ల రూపాయలకు చేరింది. వీళ్లిద్దరి నెట్ ఎస్సెట్ విలువ 125 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఓ మేనేజ్ మెంట్ కంపెనీ అంచనా ప్రకారం, వీళ్లిద్దరి సంపాదన ఏడాదికి 21శాతం పెరిగే అవకాశం ఉందట. సో.. బాలీవుడ్ రిచెస్ట్ కపుల్స్ లిస్ట్ లోకి కియరా-సిద్ కూడా చేరిపోయారన్నమాట.