Advertisement

Advertisement


Home > Movies - Movie News

వాయిదా వేశారు.. సిల్లీ రీజన్ చెప్పారు

వాయిదా వేశారు.. సిల్లీ రీజన్ చెప్పారు

ఓ సినిమాను ఎందుకు వాయిదా వేస్తారు? సకాలంలో షూటింగ్ అవ్వకపోయినా, గ్రాఫిక్స్ పెండింగ్ లో పడినా, పోస్ట్ ప్రొడక్షన్ లో జాప్యం తలెత్తినా, నటీనటులకు పారితోషికాలు ఇవ్వకపోయినా, సరైన రిలీజ్ డేట్ దొరక్కపోయినా.. ఇలా ఎన్నో కారణాల వల్ల సినిమాలు వాయిదా పడుతుంటాయి.

అయితే మండిపోతున్న ఎండల కారణంగా సినిమా వాయిదా వేస్తారా? బాక్ అనే సినిమాను అలానే పోస్ట్ పోన్ చేశారు. దీనికి వాళ్లు చెప్పిన రీజన్ ఇదే. ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల మా సినిమాను వాయిదా వేస్తున్నాం అని ఘనంగా ప్రకటించుకున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

లెక్క ప్రకారం ఏప్రిల్ 26న బాక్ సినిమా రిలీజ్ అవ్వాలి. ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల సినిమాను పోస్ట్ పోన్ చేసి మే 3న విడుదల చేస్తున్నారు. అంటే, ఈ వారం రోజుల్లో ఎండలు తగ్గిపోతాయా? నిజానికి మే నెలలో ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా. మరి ఆ మాత్రం దానికి ఈ కారణం చెప్పడం ఎందుకు? మేకర్స్ చెప్పిన ఈ సిల్లీ రీజన్ కు జనాలు నవ్వుకుంటున్నారు.

రాశిఖన్నా, తమన్న హీరోయిన్లుగా స్వీయదర్శకత్వంలో సి.సుందర్ నటించిన సినిమా బాక్. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ పని ఇంకా పెండింగ్ లో ఉంది. దాన్ని కవర్ చేయడానికి 'మండే ఎండలు' అంటూ రీజన్ చెప్పి కామెడీ చేశారు మేకర్స్.

తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. హిపాప్ తమిళ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఆల్రెడీ రాశిఖన్నా, తమన్నాలపై తీసిన ఓ ప్రమోషన్ సాంగ్ ను విడుదల చేశారు. వినడం కంటే చూడ్డానికి ఆ పాట బాగుండడంతో చాలామంది ఎట్రాక్ట్ అయ్యారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?