శిల్పాశెట్టి పేరు తెలియని సినీ అభిమానులు ఉండరు. టాలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నేళ్ల క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన తార. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ఈ జంటకు వియాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ నెల 15న సరోగసీ ద్వారా వీరికి ఆడబిడ్డ జన్మించినట్లు తెలుస్తోంది.
అంటే గర్భందాల్చకనే మాతృత్వంలోని మాధుర్యాన్ని శిల్పాశెట్టి ఆస్వాదిస్తున్నారు. శిల్పాశెట్టి కుంద్రా- రాజ్ దంపతులకు మొదటి సంతానంలో కుమారుడు పుట్టాడు. తాజాగా ఈ నెల 15న ఆ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది.
ఈ విషయాన్ని ఆ దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ‘‘ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జూనియర్ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఫిబ్రవరి 15న జన్మించింది. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలి. తల్లిదండ్రులు: రాజ్- శిల్పాశెట్టి కుంద్రా. అన్నయ్య వియాన్’’అని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
అంతేకాదండోయ్… తమ గారాలపట్టి పేరు, దాని అర్థం భలే థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. తమ కూతురి పేరు సమీశా శెట్టి కుంద్రా అని తెలిపారు. స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం, మిశ అంటే రష్యన్ భాషలో దేవత అని శిల్పాశెట్టి దంపతులు పేర్కొన్నారు.