‘సిరి’ చిందేసిన ‘శ్రీదేవి’

సాధారణంగా ఎంతో అవసరం, సిట్యువేషన్ డిమాండ్ చేస్తే తప్ప కవి సిరివెన్నెల చేత పాట రాయించరు వర్తమాన సినిమా జనాలు. ఈ పాట ఆయన మాత్రమే రాయాలి. ఆయన మాత్రమే రాయగలరు అనుకుంటూనే ఆయన…

సాధారణంగా ఎంతో అవసరం, సిట్యువేషన్ డిమాండ్ చేస్తే తప్ప కవి సిరివెన్నెల చేత పాట రాయించరు వర్తమాన సినిమా జనాలు. ఈ పాట ఆయన మాత్రమే రాయాలి. ఆయన మాత్రమే రాయగలరు అనుకుంటూనే ఆయన దగ్గరకు వెళ్లి నెలో, రెండు నెలలో వెయిట్ చేసి పాట అందుకుంటారు. దాని స్థాయి కూడా అలాగే వుంటుంది. 

లేటెస్ట్ గా ఆయన ఓ పాట రాసారు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కోసం డ్యూయట్ రాసారు. బహుశా ఇది మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ అభిరుచి కావచ్చు. 'నాలో ఇన్నాళ్లుగా..కనిపించని ఏదో ఇది..లోలో కొన్నాళ్లుగా..నాతో ఏదో అంటున్నది..అదో ఇబ్బందిగా..అనిపించినా..అది కూడా బాగున్నది..మరీ కన్నెర్రగా కసిరేసినా..చిరునవ్వులా వుందే' అంటూ ప్రారంభమైన ఈ పాట, వింటేజ్ మణిశర్మను గుర్తు చేసాయి. ఒక్కడు తదితర సినిమాల టైమ్ లో ఆయన చేసిన ట్యూన్ లు గుర్తు చేసింది. 

''..తాన తందాన..మహదానందాన..మనసే చిందేయ్యగా..తానే అందేనా..ఎంతో దూరాన..ఉందే ఆ తారక' ..' వైనం గురుతించడేం..కనుబమ్మతోనే కబురంపినా..అన్న దగ్గరకు వచ్చేసరికి సిరివెన్నెల మార్క్ కనిపిస్తుంది. సుధీర్ బాబు-ఆనందిని కాంబినేషన్ లో అచ్చంగా గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు ఈ సినిమాను. ఈ నెల 27 ను విడుదల డేట్ గా ప్రస్తుతానికి అనుకుంటున్నారు. 

పలాస ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చిల్లా విజయ్, దేవిరెడ్డి శశి నిర్మాతలు.