దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రశ్రేణి హీరోగా గత కొన్నేళ్లుగా వెలుగొందుతున్న నటుడు కరోనా బారినపడినట్టు బాలీవుడ్ యాక్టర్ రోహిత్‌రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. అంతేకాదు, ఆ హీరోను కరోనా క్వారంటైన్‌లో పెట్టినట్టు ఆయన కామెంట్ పెట్టాడు. దీంతో లక్షలాది మంది ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అగ్రశ్రేణి హీరో కరోనా బారినపడ్డారని సోషల్ మీడియాలో వెల్లడించిన బాలీవుడ్ యాక్టర్‌పై సదరు హీరో అభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తమ హీరోకు ఎలాంటి అనారోగ్యం లేదని, ఈ విషయమై తాము స్పష్టత తీసుకునే స్పందిస్తున్నా మంటూ బాలీవుడ్ యాక్టర్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో దాడికి దిగారు.
దక్షిణాదిలో ఆ హీరోకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అభిమానులు ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తారు. తమ ఆరాధ్య హీరోకు కరోనా పాజిటివ్ అనే మాటను అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆ పెద్ద హీరో అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ… నువ్వు వేసే జోక్ చాలా చెత్తగా ఉందని కామెంట్ చేశారు. ఇలాంటి జోకులతో అబిమా నుల మనోభావాలను దెబ్బతీయొద్దని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. మరి కొందరు… ఇలాంటి జోకులు భారతీయ సంస్కృతి కాదు, కాకూడదు అని కామెంట్ చేశారు.
తనపై నెటిజన్లు ట్రోలింగ్‌కు పాల్పడుతుండటంతో బాలీవుడ్ నటుడు రోహిత్ మరోసారి ట్విటర్‌లో స్పందిస్తూ…. గైస్ ఎక్కువగా బాధపడకండి అని కామెంట్ పెట్టాడు. అయితే దుమారం రేగుతున్న సదరు అగ్రశ్రేణి హీరో అనారోగ్యంపై కుటుంబ సభ్యులు, అభిమానులు కాకుండా…బాలీవుడ్ యాక్టర్ ఎందుకు స్పందించాడో అర్థం కావడం లేదు. ఇందులో నిజానిజాల మాట పక్కన పెడితే…తీవ్ర దుమారం రేపుతోందన్నది నిజం