హైదరాబాద్ లో అనేక స్పెషల్ షోలు తెల్లవారు ఝామున ప్లాన్ చేసారు. ఒక్క కూకట్ పల్లి బెల్ట్ కే ఆరు షోలు కోటి రూపాయలకు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు విక్రయించారు. అంటే మిగిలిన టోటల్ షో లు అన్నీ కలిపి ఎంత ఆదాయం ఇచ్చి వుంటాయో దిల్ రాజుకు లెక్కలు తెలియాల్సి వుంది.
ఇదిలా వుంటే ఎక్కువ షోలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కే వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ దిగాలుపడినట్లు బోగట్టా. ముఖ్యంగా కూకట్ పల్లి బెల్ట్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా వుండడంతో అటు డామినేషన్ పెరిగిపోయింది. దీంతో తప్పని సరిగా మెగాస్టార్ ఫ్యాన్స్ నాయకుడు స్వామి నాయుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
అర్జెంట్ గా ఇదే బెల్ట్ లోని రెండు షోలను ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నట్లు బోగట్టా. టికెట్ రేటు మూడు వేల నుంచి అయిదువేల వరకు పెట్టాల్సి వుంది.
అది థియేటర్ ను బట్టి వుంటుంది. కానీ ఇంత రేటు పెట్టడానికి చరణ్ ఫ్యాన్స్ చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ నే కొంత వరకు భరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరీ ధియేటర్ నిండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నే వుంటే హడావుడి వన్ సైడ్ అయిపోతుందని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నట్లు బోగట్టా.