Advertisement

Advertisement


Home > Movies - Movie News

'శబ్దం'తో భయపెట్టే సినిమా వచ్చేస్తోంది

'శబ్దం'తో భయపెట్టే సినిమా వచ్చేస్తోంది

ఇన్నాళ్లూ విజువల్స్ తో భయపెట్టే సినిమాలు చూశాం. ఇప్పుడు శబ్దంతో భయపెట్టే సినిమా వస్తోంది. ఈ సినిమా పేరు కూడా శబ్దం. ఏ సినిమా టీజర్ లేదా ట్రయిలర్ కైనా బెటర్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ కోసం హెడ్ ఫోన్స్ పెట్టుకోమని ఓ కార్డు వేస్తారు. ఇందులో కూడా వేశారు కానీ అది రివర్స్ లో ఉంది. "మంచి సౌండ్ అనుభవం కోసం హెడ్ ఫోన్స్ ఉపయోగించడం శ్రేయష్కరం కాదు, ఇది మీకు హాని కలిగిస్తుంది." అనే టైటిల్ కార్డుతోనే తమ టీజర్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు.

తెరపై శబ్ద తరంగాలతో, తెరవెనక భయంకరమైన సౌండ్ ఎఫెక్టులతో నిజంగా భయపెట్టేలా మొదలైంది శబ్దం టీజర్. వీడియో లోపలకు వెళ్లేకొద్దీ వెన్నులో వణుకుపుట్టించే దృశ్యాలు, శబ్దాలు ఎదురుపడతాయి.

హీరో ఆది తన పరికరాలతో శబ్దాల్ని రికార్డు చేయడానికి దెయ్యం ఉన్న ఇంట్లోకి అడుగుపెడతాడు. సినిమా అసలు కథేంటనే విషయాన్ని టీజర్ లో చెప్పకపోయినప్పటికీ, జానర్ ఏంటనేది స్పష్టంగా చెప్పారు, చూపించారు, వినిపించారు కూడా.

గతంలో ఆదితో వైశాలి లాంటి టెక్నికల్ థ్రిల్లర్ మూవీని తీసిన అరివగన్, ఈ శబ్దం సినిమాకు దర్శకుడు. వైశాలికి అద్భుతమైన సౌండింగ్ ఇచ్చిన తమన్, ఈ సినిమాకు కూడా సంగీతం అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తన అనుభవం కనిపిస్తోంది.

టీజర్ లో టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?