కొత్త సినిమా ఓపెన్ అయింది.. శ్రీలీల వచ్చేసింది

ఓ కొత్త సినిమా లాంఛ్ అయితే చాలు, శ్రీలీల పేరు తెరపైకి వచ్చేస్తోంది. కాస్తోకూస్తో క్రేజ్ ఉన్న సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. అలా ఇప్పటికే చాలా అవకాశాలు అందుకున్న ఈ…

ఓ కొత్త సినిమా లాంఛ్ అయితే చాలు, శ్రీలీల పేరు తెరపైకి వచ్చేస్తోంది. కాస్తోకూస్తో క్రేజ్ ఉన్న సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. అలా ఇప్పటికే చాలా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ, నిన్న లాంచ్ అయిన సినిమాలో కూడా హీరోయిన్ గా సెలక్ట్ అయింది.

దిల్ రాజు కాంపౌండ్ నుంచి హీరోగా మారిన ఆశిష్.. తన రెండో ప్రయత్నంగా సెల్ఫిష్ అనే సినిమా స్టార్ట్ చేశాడు. ధనుష్ క్లాప్ తో నిన్న ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇందులో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు. త్వరలోనే ఆ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించబోతున్నారు.

పెళ్లిసందD సినిమాతో హీరోయిన్ గా మారింది శ్రీలీల. ఆ సినిమా ఫ్లాప్ అయినా శ్రీలీల అందాలు క్లిక్ అయ్యాయి. బి, సి సెంటర్లలో ఆమెకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దీంతో  ఆటోమేటిగ్గా అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే రవితేజ సరసన ధమాకా అనే సినిమాలో నటిస్తున్న ఈ చిన్నది.. గాలి జనార్థన్ రెడ్డి కొడుకు హీరోగా రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటించనుంది.

వీటితో పాటు తాజాగా లాంఛ్ అయిన నితిన్-వక్కంతం వంశీ సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకున్నారు. అటు వైష్ణవ్ తేజ్, నవీన్ పొలిశెట్టి కొత్త సినిమాల కోసం కూడా శ్రీలీలనే అనుకుంటున్నారు. ఇలా టాలీవుడ్ లో ఏమాత్రం క్రేజ్ ఉన్న ప్రాజెక్టు లాంఛ్ అయినా అందులో హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపిస్తోంది.