తెలుగు సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ నే. ఎప్పుడో కానీ నటించే అవకాశం తక్కువ వుంటుంది. ఉప్పెనతో సర్రున వచ్చిన కీర్తి శెట్టికి బోలెడు అవకాశాలు వచ్చాయి.
ఎంత చూపించేయాలో అంతా చూపించేసారు. నటనకు అవకాశాలూ తక్కువే. ప్రూవ్ చేసుకున్నదీ తక్కువే. ఇప్పుడు టాలీవుడ్ డయాస్ మీదకు శ్రీలీల వచ్చింది.
పెళ్లి సందD, ధమాకా సినిమాలతో ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. చేతిలో దాదాపు పది సినిమాలు వున్నాయి. డే అండ్ నైట్ షూట్ చేస్తోంది. వీటిలో ముందుగా స్కంధ, ఆదికేశవ రాబోతున్నాయి.
స్కంధ సినిమా నుంచి సాంగ్ వచ్చింది. శ్రీలీలకు ఇచ్చిన మంచి రెమ్యూనిరేషన్ కిట్టుబాటు అయ్యేలా చిట్టి పొట్టి బట్టలేసి, ఎలా ఊపితే కుర్రకారు గుండెలు ఊగుతాయో అలాంటి స్టెప్స్ వేయించారు.
గమ్మత్తేమిటంటే ఈ పబ్ సాంగ్ ఫుల్ గా విడుదల చేస్తే ఎలా వుంటుందో కానీ ఇప్పుడు వదిలిన సాంగ్ లో మాత్రం రామ్ సోలో పెర్ ఫార్మెన్స్ కు ఎక్కువ చాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇద్దరు కలిసినవి ఒకటి రెండు సీన్లు మాత్రమే చూపించారు.
శ్రీలీల డ్యాన్స్ స్పీడ్ పక్కన రామ్ తేలిపోతాడేమో అన్న కామెంట్లు వస్తాయని ఇప్పటికి జాగ్రత్త పడ్డారేమో?
బోయపాటి సినిమాల్లో హీరోయిన్లకు కాస్త స్కోప్ వుంటుంది. ఈ సినిమాలో కూడా అలాగే వుంటుందని ఆశిద్దాం. లేదంటే ఇలా చిట్టి పొట్టి బట్టల డ్యాన్స్ లతో అందరి హీరొలను ఓ రౌండ్ వేసేస్తే, ఆ తరువాత మళ్లీ కృతి శెట్టి పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో శ్రీలీల జాగ్రత్త పడాల్సి వుంటుంది.