Advertisement

Advertisement


Home > Movies - Movie News

హైదరాబాద్ లో శ్రీకాకుళం సెట్

హైదరాబాద్ లో శ్రీకాకుళం సెట్

గతంలో ఉప్పెన కోసం హైదరాబాద్ లో ఏకంగా సముద్రం సెట్ వేశారు. చాలా సన్నివేశాల్ని అందులోనే తీశారు. ఇప్పుడు తండేల్ కోసం కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. శ్రీకాకుళంలోని ఓ మత్స్యకార గ్రామం నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్ వేశారు. ప్రస్తుతం ఆ సెట్ లోనే షూట్ చేస్తున్నారు.

తాజాగా తండేల్ నుంచి ఆన్-లొకేషన్ స్టిల్స్ రిలీజ్ చేశారు. వీటిలో నాగచైతన్య, సాయిపల్లవి సాధారణ దుస్తుల్లో కనిపిస్తున్నారు. మత్స్యకార గ్రామాన్ని తలపించేలా వేసిన సెట్స్ లో హీరోహీరోయిన్లపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచి, వివిధ దశల్లో ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 2 గ్లింప్స్ రిలీజయ్యాయి. వాటికి అదనంగా ఎప్పటికప్పుడు వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది తండేల్ సినిమా. కార్తికేయ-2 త ర్వాత చందు మొండేటి చేస్తున్న సినిమా ఇదే. కెరీర్ లో తొలిసారి ఈ తరహా కథను భుజానికెత్తుకున్న చందు.. నటీనటుల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటున్నాడు.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ దత్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. దీనికోసం కూడా వీళ్ల దగ్గర ఓ వినూత్న ప్రచార కార్యక్రమం సిద్ధంగా ఉంది.

Click Here More Photos

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?