శ్రీకాంత్ అడ్డాల..పెదకాపు.. ఫుల్ ఫైర్

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా జర్నీ భలే చిత్రంగా వుంది. ఎక్కడ బిగిన్ చేసారు.. ఎలా మారుతూ వస్తున్నారు. లేటెస్ట్ సినిమా పెదకాపు ట్రయిలర్ చూస్తుంటే.. సుకుమార్ రంగస్థలం మదిరిగా సామాజిక అంశాన్ని తీసుకుని…

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా జర్నీ భలే చిత్రంగా వుంది. ఎక్కడ బిగిన్ చేసారు.. ఎలా మారుతూ వస్తున్నారు. లేటెస్ట్ సినిమా పెదకాపు ట్రయిలర్ చూస్తుంటే.. సుకుమార్ రంగస్థలం మదిరిగా సామాజిక అంశాన్ని తీసుకుని ఫుల్ ఫైర్ సినిమా తీసినట్లు కనిపిస్తోంది. 

ముకుంద సినిమాలో పైపైన టచ్ చేసిన రాజకీయ, సామాజిక నేపథ్యాన్నే మళ్లీ తీసుకుని, ఈసారి మరింత బలంగా, మరింత డెప్త్ కు వెళ్లి చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఈ రోజు విడుదలైన పెదకాపు 1 ట్రయిలర్ చూస్తుంటే.

రెండు సామాజిక వర్గాల మధ్య రగిలిన పోరును ఆసక్తిగా స్క్రీన్ మీదకు తెచ్చినట్లు కనిపిస్తోంది. అసలే ఆంధ్ర మొత్తం కుల రాజకీయాలతో అట్టుడుకుతోంది. పెదకాపు ట్రయిలర్ అదే పరిస్థితిని బలంగా చెప్ప బోతున్నట్లు కనిపిస్తోంది. 

ట్రయిలర్ లో పైపైన టచ్ చేసారు కానీ, సినిమాలో డైలాగులు, కులాల మధ్య అంతరాలు, పవర్ గేమ్, ఇంకా ఇంకా చాలా వున్నట్లు కనిపిస్తోంది. ఇవన్నీ సెన్సారు ను దాటుకుని అలాగే బయటకు వస్తే మాత్రం సినిమా కాస్త గట్టిగానే వుండేలా కనిపిస్తోంది.

కొత్త హీరో విరాట్ కర్ణ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. శ్రీకాంత్ అడ్డాల కూడా చాలా కీలకపాతలో నటించినట్లుంది. రావు రమేష్, నాగబాబు,అనసూయ ఇంకా ఇంకా చాలా మంది పెర్ ఫెక్ట్ కాస్టింగ్ కింద కనిపించారు. ట్రయిలర్ మొత్తం ఇంప్రెసివ్ గా కట్ చేసారు. నారప్ప, ముకుంద సినిమాలు తీసిన అనుభవం, ఆలోచనా విధానం మరింత పదును తేలినట్లు ఈ ట్రయిలర్ చెబుతోంది. ఈ సినిమాకు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి.