‘బాహుబ‌లి’ని చూస్తూ నిద్ర‌పోయిన వాళ్లూ ఉంటారు క‌దా!

మ‌న‌కు అర్థం కాని భాష‌లో సినిమాలు చూస్తుంటే చాలా మందికి వచ్చే ఫీలింగ్ నిద్ర‌. థియేట‌ర్లో అయినా స్మార్ట్ ఫోన్లో అయినా అలాంటి సినిమాలు చూస్తే నిద్ర‌పోయే వాళ్లు చాలా మంది ఉంటారు. బ‌హుశా…

మ‌న‌కు అర్థం కాని భాష‌లో సినిమాలు చూస్తుంటే చాలా మందికి వచ్చే ఫీలింగ్ నిద్ర‌. థియేట‌ర్లో అయినా స్మార్ట్ ఫోన్లో అయినా అలాంటి సినిమాలు చూస్తే నిద్ర‌పోయే వాళ్లు చాలా మంది ఉంటారు. బ‌హుశా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కూడా ఈ కోవ‌కే చెందిన వారై ఉండాలి. 

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. సౌత్ కొరియ‌న్ ఆస్కార్ అవార్డెడ్ మూవీ పార‌సైట్ చూస్తూ ఉంటే త‌న‌కు నిద్ర వ‌చ్చింద‌ని ఎస్ఎస్ రాజ‌మౌళి చెప్పుకొచ్చారు. ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్యానాలు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. 

పార‌సైట్ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తొలి సారి ఇంగ్లిషేత‌ర సినిమాకు ఆస్కార్ బెస్ట్ పిక్చ‌ర్ అవార్డును కూడా ఇచ్చారు. అమెరిక‌న్లు ఈ సినిమాను అలా క‌ళ్ల‌కు అద్దుకున్నారు. ఆ త‌ర్వాత ప్ర‌పంచం దృష్టి పార‌సైట్ మీద ప‌డింది. అనేక మంది ఈ సినిమాను కీర్తిస్తున్నారు. ఇక స‌హ‌జంగానే కొంద‌రు విమ‌ర్శిస్తూ ఉన్నారు!  విమ‌ర్శ‌ల‌కు బ‌హుశా ప్ర‌పంచంలో ఏ సినిమా కూడా అతీతం కాదేమో!

ఆ సంగ‌త‌లా ఉంటే..పార‌సైట్ సినిమా చూస్తూ చూస్తూ త‌ను నిద్ర‌పోయిన‌ట్టుగా రాజ‌మౌళి చెప్పుకొచ్చారు. ఆ సినిమా పూర్తిగా చూడ‌లేద‌ని చెప్పారు. ఆ సినిమా పూర్తిగా చూడ‌క‌పోవ‌డం పాపం ఏమీ కాదు కానీ, ఆ సినిమా చూస్తుంటే త‌న‌కు నిద్ర‌ప‌ట్టేసింద‌ని ఈ ద‌ర్శ‌కుడు ఇన్ డైరెక్టుగా చెప్పిన‌ట్టుగా ఉన్నారు. ఏ సినిమా అయినా అంద‌రికీ నచ్చాల‌ని లేదు, బాహుబ‌లి సీరిస్ సినిమాల‌ను చీల్చిచెండాడిన వారు లేరా! వాటిని చూస్తూ అలా నిద్ర‌పోయిన వాళ్లు ఉండ‌రా!

కన్నా బీజేపీకి మాత్రం కన్నం వెయ్యకు